Kamal Nath: మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఆ రాష్ట్రంలోని 230 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ ఇప్పటికే ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ 116 స్థానాలను దాటింది. అక్కడ 150కి పైగా స్థానాల్లో బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై ఆధిక్యత కనబరుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా దూసుకెళుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 49 కేంద్రాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులో చాలాచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. నాలుగో రౌండ్ లోనూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కొడంగల్‌లో ఆధిక్యంలో ఉన్నారు. నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి 5687 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో మూడో రౌండ్ ఫలితాలు వెలువడయ్యాయి. కొడంగల్, కామారెడ్డిలో మూడో రౌండ్లో రేవంత్‌రెడ్డికి లీడ్ లో కొనసాగుతున్నారు. కొడంగల్‌లో 4159 ఓట్లు, కామారెడ్డిలో 2354 ఓట్ల ఆధిక్యంలో రేవంత్‌రెడ్డి ఉన్నారు.
తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో రెండో రౌండ్ ఫలితాలు వెలువడయ్యాయి. రెండో రౌడ్లో గోషామహల్లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌కు 2800 ఓట్ల ఆధిక్యం ఉంది. మధిరలో రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 4,137 ఓట్ల ఆధిక్యంలో భట్టి విక్రమార్క ఉన్నారు. కల్వకుర్తిలో బీఆర్ఎస్ అభ్యర్థికి 145 ఓట్ల ఆధిక్యంలో ఉండగా.. ఇబ్రహీంపట్నంలో రెండో రౌండ్ పూర్తి అయ్యే సరికి ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు.
Durgam Chinnaiah: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే పై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై నెన్నెల పోలీసులు కేసు నమోదు చేశారు.
Madhya Pradesh: సింగ్ ఈస్ కింగ్.. మరోసారి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శివ"రాజ్"సింగ్ పాలనే కొనసాగుతుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇండియా టుడే, ఇండియా టీవీ, రిపబ్లిక్ టీవీ వంటివి బీజేపీనే గెలుస్తుందని చెబుతున్నాయి. ఇదిలా ఉంటే మరికొన్ని సంస్థలు మాత్రం బీజేపీ కన్నా స్వల్పంగా కాంగ్రెస్ కొన్ని స్థానాలను సాధిస్తుందంటూ అంచనా వేస్తున్నాయి.
పోలింగ్ ముగిసిన అనంతరం.. గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రభుత్వం మీద ఎంత ద్వేషం ఉందో గజ్వేల్ లో తిరిగితే అర్థం అవుతుందని ఆరోపించారు. కేసీఆర్ చెప్పేది వేరు చేసేది వేరు.. నియంత లాగా వ్యవహారం చేశారని తెలిపారు. కేసీఆర్ ని ఓడించడానికి బలమైన నాయకుడు ఎక్కడ ఉంటే అక్కడ జనం ఓటు వేశారని తెలిపారు.
గత పదేళ్లలో తాను చేసిన కృషి వల్ల ప్రజలకు తన ప్రభుత్వంపై అపారమైన విశ్వాసం ఏర్పడిందని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం చెప్పారు. ఎందుకంటే ఓటు బ్యాంకు పరిగణనలు వారి అభివృద్ధి కార్యక్రమాలకు మార్గనిర్దేశం చేస్తూ పౌరుల "మై బాప్" లాగా వ్యవహరించినందుకు గత పాలనలను తప్పుపట్టారు.