Election Results 2023 : భారత ఎన్నికల సంఘం మార్చిన షెడ్యూల్ ప్రకారం మిజోరంలో ఓట్ల లెక్కింపు సోమవారం జరగనుంది. ఇక్కడ అధికార పార్టీలు మిజో నేషనల్ ఫ్రంట్ (MNF), జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ (ZPM), కాంగ్రెస్ ఉన్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పు గౌరవిస్తున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కామారెడ్డిలో బీజేపీని గెలిలించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం పెద్ద విజయమని అన్నారు. కేసీఆర్ కుటుంబం మీద ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ గెలుపుకి కారణం అని కిషన్ రెడ్డి పేరొన్నారు. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి విజయం సాధించడంతో.. ఆయనకు అభినందనలు తెలిపేందుకు కిషన్ రెడ్డి కామారెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన…
కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన నిలబడి బీజేపీ పోరాడితే చివరకు కాంగ్రెస్ లాభపడిందన్నారు. ఈ సందర్భంతా బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. కరీంనగర్ విషయానికొస్తే ప్రతిసారి తన ఓట్ల శాతం పెరుగుతోందన్నారు.
BJP: తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా గుర్తింపు ఉన్నా.. అధికారంలో కోసం పదేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి ప్రత్నామ్నాయమని చెప్పుకున్న బీజేపీ గతంలో కన్నా మెరుగైన సీట్లను, ఓట్ షేర్ని సాధించింది. 2018 ఎన్ని్కల్లో 7 శాతం ఓట్ షేర్‌తో కేవలం ఒకే స్థానాన్ని గెలిచిన బీజేపీ ఈ సారి ఏకంగా 14 శాతం ఓట్లను సాధించి…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజారాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డి.. బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై 17,158 ఓట్ల మెజారిటీతో గెలిచారు. దాంతో ఇక్కడ ‘శవయాత్ర’ తప్పింది. ప్రచారంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తాను ఓడిపోతే హుజారాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ తన శవయాత్రకు రావాలని కోరిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం చివరి రోజున పాడి…
Ashok Gehlot: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో బీజేపీ అఖండ విజయం సాధించడంతో ఆయన తన రాజీనామాను గవర్నర్‌కి అందించారు. గవర్నర్ కల్రాజ్ మిశ్రా నివాసానికి వెళ్లి రాజీనామా సమర్పించారు. మొత్తం 199 స్థానాలకు గానూ ఎన్నికలు జరగగా.. బీజేపీ 115 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఏర్పడింది. కాంగ్రెస్ 70 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. దీంతో కాంగ్రెస్ ఓటమి ఖాయం కావడంతో గెహ్లాట్ సర్కార్ గద్దెదిగబోతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కమలం పార్టీ (బీజేపీ) ఖాతా తెరవలేదు. పోటి చేసిన ఇద్దరు ఎంపీలు పరాజయం పాలయ్యారు. బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ సైతం ఓటమి చెందారు. దాంతో మూడు చోట్ల రెండవ స్థానంతో కమల నాథులు సరిపెట్టుకున్నారు. కరీంనగర్ నుంచి బరిలోకి దిగిన ఎంపీ, పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పోరాడి ఓడారు. వరుసగా మూడు సార్లు గంగుల చేతిలో ఓడిపోవడం విశేషం. కోరుట్ల నుంచి…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు దాదాపు ముగిసింది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్‌కు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను అలవోకగా అందుకుంది. కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మరోవైపు వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలన్న బీఆర్ఎస్ ఆశలు ఆవిరైపోయాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజారాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి విజయం సాధించారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై కౌశిక్ రెడ్డి గెలిచారు. విజయం అనంతరం హుజురాబాద్ ప్రజలకు కౌశిక్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈటెల ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. ఈటెలకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చానని.. కౌశిక్‌తో ఇలాగే ఉంటదన్నారు. ‘నా గెలుపుకు కారణమైన హుజురాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు. ఈటెల రాజేందర్ ఇప్పటికైనా నోరు…
Bandi Sanjay Wants Re Counting in Karimnagar: కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితంపై హైడ్రామా కొనసాగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్.. బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై 326 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న బండి సంజయ్.. రీకౌంటింగ్ కోరారు. దాంతో అధికారులు ఫలితాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కౌంటింగ్‌లో ఏం జరుగుతుందో అర్థంకాని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న గంగుల కమలాకర్.. కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు.…