DMK MP: డీఎంకే ఎంపీ పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. బీజేపీ విజయాన్ని ప్రస్తావిస్తూ.. డీఎంకే ఎంపీ డీఎన్వీ సెంథిల్ కుమార్ మంగళవారం లోక్‌సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీని విమర్శిస్తూ ఆయన వ్యాఖ్యలు చేయడంపై వివాదం రాజుకుంది. బీజేపీ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ప్రధానంగా హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాల్లో లేదా మేము గోమూత్ర రాష్ట్రాలుగా పిలుస్తాము వీటిలో బీజేపీ గెలుస్తుందని, మీరు దక్షిణ భారతదేశానికి రాలేరు’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఫలితాలు చూస్తే ఇది అర్థమవుతుందని అన్నారు. ‘‘ఈ రాష్ట్రాల్లో మీరు అధికారంలోకి రాలేదు, మీరు అధికారంలోకి రావాలంలటే ఈ రాష్ట్రాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మీరు మార్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని, మొత్తం దక్షిణాదిని తమ ఆధీనంలోకి తీసుకోవాలని మీరు కలలు కంటున్నారు.’’ అని సెంథిల్ కుమార్ అన్నారు.
కాగా, దీనిపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై స్పందించారు. డీఎంకే పార్టీ వర్షంలో చెన్నై మునిగిపోయిన విధంగా అహంకారంలో మునిగిపోతుందని, అహంకారమే డీఎంకే పతనానికి కారణమవుతుందని ఆయన అన్నారు. పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి అధికారంలో ఉందని, ఇటీవల వరకు కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న విషయాన్ని డీఎంకే నేత బహుశా మరిచిపోయారని అన్నామలై అన్నారు. ఇలాంటి వ్యాఖ్యల్ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమర్థిస్తారా..? అంటూ కర్ణాటక బీజేపీ నేత సీటీ రవి ప్రశ్నించారు.
Read Also: Uttam Kumar Reddy: పార్టీ పెద్దలకు చెప్పాల్సింది చెప్పా.. సీఎం పోస్ట్‌పై ఉత్తమ్ ఆసక్తికర వ్యాఖ్యలు
రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన కొద్ది రోజలు తర్వాత ఎంపీ సెంథిల్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ అన్నపూర్ణా దేవీ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రజలు బీజేపీకి ఓటేశారని, ప్రధాని మోడీపై నమ్మకం ఉందని, ఇలాంటి ప్రకటనలు చేసేవారు ప్రపంచవ్యాప్తంగా మోడీకి ఉన్న పాపులారిటీని చూసి ఈర్ష్య పడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
గతంలో డీఎంకే నేత, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియాతో పోలుస్తూ, దాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీతో పాటు పలువురు హిందూ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తన వ్యాఖ్యల్ని బీజేపీ వక్రీకరించిందని, తాను అన్ని వర్గాలను సమానంగా చూడాలని చెప్పానని ఉదయనిధి కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.
DMK MP DNV Senthil Kumar attacks North Indians with ‘gaumutra’ jibes inside the Parliament.
Outrage? Anyone? pic.twitter.com/R7w3XmLXLo
— BALA (@erbmjha) December 5, 2023