Rajasthan: ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే రాజస్థాన్‌లో బీజేపీ ఘన విజయం సాధించింది. రాష్ట్రంలోని 199 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగగా మ్యాజిక్ ఫిగర్ దాటి 115 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. అయితే రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ విజయం మరో ‘యోగి’ ఎదుగుదలకు దారి తీసే అవకాశం ఏర్పడింది. రాజస్థాన్ యోగిగా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మి నాయకుడు, అల్వార్ ఎంపీ బాబా బాలక్ నాథ్ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థుల్లో ఒకరుగా ఉన్నారు.
PM Narendra Modi: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఈ రోజు జరిగిన 4 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జరిగింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలో బీజేపీ బంపర్ విక్టరీ సాధించింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఆయా రాష్ట్రాల ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రజలు సుపరిపాలన, అభివృద్ధి రాజకీయాలను ఎంచుకున్నారని ఫలితాలు సూచిస్తున్నాయని అన్నారు.
BJP Winning candidates in Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. దాంతో హ్యాట్రిక్ కొడదామని ఆశించిన బీఆర్ఎస్కు షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 10 సీట్లు కూడా గెల్వలేకపోయింది. బీజేపీ అగ్ర నేతలు ఈటెల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావులకు చుక్కెదురైంది. దాంతో తెలంగాణలో బీజేపీ హవా తగ్గిపోయిందనే చెప్పాలి. బీజేపీ 8 చోట్ల గెలిచింది. ఈ లిస్ట్ ఓసారి చూద్దాం. 1 నిర్మల్…
Telangana Results: తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ గతంతో పోలిస్తే ఎమ్మెల్యే సీట్లను ఓట్లను పెంచుకోగలిగింది. తామే బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం అని కర్ణాటక ఎన్నికల ఫలితాల ముందు వరకు చెప్పిన బీజేపీ, కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత సైలెంట్ అయింది. మరోవైపు కర్ణాటక విజయం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి జోష్ పెంచింది. అయితే గతంలో 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కస్థానంలోనే గెలుపొందిన బీజేపీ, ఈ సారి 8 స్థానాలను గెలుచుకుంది.
Kamareddy: కామారెడ్డిలో బీజేపీ ఘన విజయం సాధించింది. రాష్ట్ర ప్రజలే కాకుండా, దేశం మొత్తం కామారెడ్డి నియోజకవర్గంపై ఆసక్తి కనబర్చాయి. సీఎం కేసీఆర్‌తో పాటు కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థిగా చెప్పబడుతున్న రేవంత్ రెడ్డిని బీజేపీ అభ్యర్థి వెంకటరమణా రెడ్డి ఓడించారు. ముందు నుంచి అనుకుంటున్నట్లుగా ఈ సీటులో హోరాహోరీ పోరు జరిగింది. క్షణక్షణానికి, రౌండ్ రౌండ్‌కి ఆధిక్యం మూడు పార్టీల మధ్య మారుతూ వచ్చింది. చివరకు కామారెడ్డి ఓటర్ స్థానిక అభ్యర్థికే పట్టం కట్టారు. ఇద్దరు…
అన్ని సమస్యలపై చర్చించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని, నియమాలు, విధానాలను అనుసరించి చర్చ జరగాలని మంత్రి ప్రహ్లద్ జోషి పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో 19 బిల్లులు, రెండు ఆర్థిక అంశాలు పరిశీలనలో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.
కామారెడ్డిలో హోరాహోరీ పోరు జరుగుతుంది. కామారెడ్డిలో 14వ రౌండ్ ముగిసేసరికి 2,100 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ముందంజలోకి వచ్చారు.. రెండో స్థానంలో రేవంత్‌రెడ్డి, మూడోస్థానంలో కేసీఆర్ కొనసాగుతున్నారు.
Ashok Gehlot: రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ, సీఎం అశోక్ గెహ్లాట్‌పై విమర్శలు ఎక్కుపెట్టింది. మాంత్రికుడి మాయ నుంచి రాజస్థాన్ బయటపడిందని అశోక్ గెహ్లాట్‌పై కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ‘‘మాయాజాలం ముగిసింది మరియు రాజస్థాన్ మాంత్రికుడి మాయ నుండి బయటపడింది. మహిళల గౌరవం కోసం, పేదల సంక్షేమం కోసం ప్రజలు ఓట్లు వేశారని’’ అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఈ క్రమంలో బీజేపీ తొలి విజయం సాధించింది. నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. ఇదిలా ఉంటే.. బీజేపీ 8 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతుంది.
BJP-Congress: 2024 లోకసభ ఎన్నికల ముందు జరుగుతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా అంతా ఆసక్తి నెలకొంది. ఈ రోజు మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. దాదాపుగా మూడు రాష్ట్రాలు బీజేపీ ఖాతాలో చేరబోతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది.