Rajasthan: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఈ సారి ఎన్నికల్లో సీఎం అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ పరాజయం పాలవుతారని రెండు ఎగ్జిట్ పోల్స్ అంచానా వేశాయి. 200 స్థానాలు ఉన్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది.. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఎన్నికలకు జరగగా.. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో గంట ముందే అంటే సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది.
Telangana Elections 2023: ఎన్నికలలో ప్రజలను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు రకరకాల వాగ్దానాలు చేస్తుంటాయి. అనేక పార్టీలు డబ్బు, మద్యంతో ప్రజలను మభ్యపెడుతుంటాయి.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి నియమించారు.
CAA: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం( సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్)(సీఏఏ) అమలును ఎవరూ ఆపలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. బీజేపీ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు. సీఎం మమతాబెనర్జీ బుజ్జగింపు, చొరబాట్లు, అవినీతి, రాజకీయ హింసకు పాల్పడుతోందిన ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రభుత్వాన్ని గద్దె దించి రాష్ట్రంలో బీజేపీని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.
2014లో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసింది.. ప్రత్యేక హోదా విభజన హామీల అమలు సహా ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేదు.. పోలవరం ప్రాజెక్టు అతి గతి లేని పరిస్థితి అయిందని ఏపీ పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు.
Kishan Reddy Visits Bhagyalakshmi Temple: తెలంగాణలో గురువారం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా.. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ జి కిషన్ రెడ్డి కోరారు. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయని, తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని అమ్మవారిని కోరుకున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్లోని చార్మినార్ను వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారిని ఈరోజు కిషన్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం కిషన్…
బీజేపీ సంక్షేమం,అభివృద్ధికి పాటుపడుతున్న సందర్భం అందరూ చూస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు. సమసమాజం స్థాపనకు బీజేపీ పాటుపడుతుందన్నారు. మోడీ అనేక విధాలుగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని.. రాబోయే రోజుల్లో దేశం అభివృద్ధిలో రెండు, మూడు స్థానాలకు చేరుకుంటుందన్నారు.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్నగర్లోని ఓ కాలేజీలో ముస్లిం విద్యార్థినులు తలపెట్టిన ఫ్యాషన్ షో వివాదాస్పదం అవుతోంది. ఈ షోపై జమియత్-ఏ-ఉలేమా అనే ముస్లిం సంస్థ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం దీనిపై బీజేపీ స్పందించింది. ముస్లిం సంస్థ తీరును తప్పుపట్టింది.