YCP vs TDP: హైదరాబాద్‌లో ఏపీ ఓటర్ల రిజిస్ట్రేషన్..! టీడీపీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YCP vs TDP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనాను కలిసిన వైసీపీ నేతలు.. హైదరాబాద్ లో టీడీపీ ఆధ్వర్యంలో ఏపీ ఓటర్ల రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు.. సీఈవో ను కలిసినవారిలో మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఉన్నారు.. ఈ సందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. చంద్రబాబు వ్యవస్థలు మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడు.. హైదరాబాద్ లో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు.. హైదరాబాద్ లో చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. హైదరాబాద్ ప్రగతి నగర్ లో బ్యానర్లు కట్టి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు.. సిగ్గు లేకుండా పక్క రాష్ట్రంలో బ్యానర్లు కట్టి ఓట్లు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు అంటూ మండిపడ్డారు.
Read Also: Utter Pradesh: యూపీలో ఘోరం.. బాలికపై గుర్తు తెలియని యువకుడు అత్యాచారం
Also Read
- Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
- Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
- Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
- Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..
టీడీపీ నాయకులు నపుంసకుల్లా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నాగార్జున.. మాజీ మంత్రి ఉమా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ లో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేయకుండా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు మంత్రి మేరుగ నాగార్జున. ఇక, ఎన్నికల్లో లబ్ది పొందేందుకు టీడీపీ కుట్రలు చేస్తుందని దుయ్యబట్టారు ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ మల్లాది విష్ణు.. వైసీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే ప్రయత్నం టీడీపీ చేస్తోందని ఆరోపించారు. మరోవైపు.. స్థిర నివాసం ఉన్నచోటే ఓటు హక్కు కల్పించాలని సీఈవోను కోరాం అన్నారు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి.. తెలంగాణ ఓట్లను ఏపీలో మార్చడానికి సిగ్గులేదా? అని నిలదీశారు. ఎన్నికల ప్రక్రియలో ఎక్కడా వాలంటీర్లను ఉపయోగించడం లేదన్నారు. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ టీడీపీ కండువా వేసుకుని మాట్లాడితే బాగుంటుందంటూ మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి.
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
-
Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
-
TDP Candidates 2nd List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల.. 22 మంది అభ్యర్థులు వీరే!
-
Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!