దేశం గర్వించదగ్గ దర్శకుల్లో మణిరత్నం తనకంటూ ఓ స్థానం సంపాదించారు. అంతర్జాతీయ వేదికలపై సైతం మణిరత్నం హవా విశేషంగా వీచింది. ఇంతకూ మణిరత్నంలో అంత గొప్పతనం ఏముందబ్బా? అంటూ ఎకసెక్కేలు చేసేవారు ఉన్నారు. ఎందుకంటే చాలా రోజులుగా మణిరత్నం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటలేకపోతున్నాయి. పైగా ఆయన నుండి వస్తున్న చిత్రాలలోనూ పాతకథలే కనిపించాయి. దాంతో ఈ తరం జనం మణి సినిమాలను అంతగా పట్టించుకోవడం లేదు. అందువల్ల నవతరం ప్రేక్షకులకు మణిరత్నం చిత్రాల్లోని…
ఏడు వేలకు పైగా పాటలు… 1400 పై చిలుకు సినిమాలు… ఇరవై వేలకు పైగా కాన్సర్ట్స్… ఒకే సంగీత దర్శకుడు సుసాధ్యం చేశారంటే నమ్మశక్యమా!? అవును, నమ్మితీరాలి… ఎందుకంటే ఆ ఫీట్ సాధించిన వారు ఇళయరాజా! కాబట్టి సాధ్యమే అని నమ్మవచ్చు. తన తరం సంగీత దర్శకుల్లో ఇళయరాజా లాగా అభిమానగణాలను సంపాదించిన వారు మరొకరు కానరారు. తెరపై ఇళయరాజా పేరు కనిపించగానే అభిమానుల ఆనందం అంబరమంటేది. దాదాపుగా స్టార్ హీరోల స్థాయిలో ఇళయరాజా పేరు మారుమోగి…
అనువాద చిత్రాలతోనే తెలుగువారిని ఆకట్టుకున్న మాధవన్, ఇప్పుడు స్ట్రెయిట్ మూవీస్ తోనూ మెప్పించే ప్రయత్నంలో ఉన్నాడు. ‘ఓం శాంతి’ తెలుగు చిత్రంలో అతిథి పాత్రలో కనిపించిన మాధవన్, ‘సవ్యసాచి’, ‘నిశ్శబ్ధం’ చిత్రాలలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ మెప్పించాడు. నటునిగానే కాకుండా, నిర్మాతగా, దర్శకునిగానూ తన ప్రతిభను చాటుకొనే ప్రయత్నంలో ఉన్నాడు మాధవన్. రంగనాథన్ మాధవన్ 1970 జూన్ 1న జెమ్ షెడ్ పూర్ లో జన్మించాడు. ఆయన తండ్రి రంగనాథన్ తమిళనాడుకు చెందిన అయ్యంగార్. టాటా…
ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకుడే, అంతకు మించిన సంగీత దర్శకుడు! ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రాల్లో ఈ తరం వారికి పలు లోటుపాట్లు కనిపించవచ్చు. కానీ, కృష్ణారెడ్డి స్వరకల్పన మాత్రం ఈ నాటికీ వీనులవిందు చేస్తూనే ఉంటుంది. ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాల్లో వినోదంతో పాటు సంగీతమూ ఆనందం పంచేది. ఎస్వీ జైత్రయాత్ర సాగుతున్న రోజుల్లో పాటలపందిళ్ళు కూడా వేస్తూ సాగారు. ప్రతీచోట జేజేలు అందుకున్నారు. అందుకే కొందరికి ఆయన ‘ఎస్.వి.’ అంటే ‘స్వరాల వరాల కృష్ణారెడ్డి’ అనిపించారు. మరికొందరికి స్వర…
నటుడు భానుచందర్ ఈ తరం వారికి కేరెక్టర్ యాక్టర్ గా పరిచయం. కానీ, ఒకప్పుడు మార్షల్ ఆర్ట్స్ తో తనదైన బాణీ పలికిస్తూ హీరోగానూ మురిపించారు. అనేక చిత్రాలలో విలక్షణమైన పాత్రల్లోనూ అలరించారు. చూడటానికి ఇప్పటికీ నాజూగ్గా కనిపించే భానుచందర్ ఈ యేడాదితో 70 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నారు. మద్దూరు వెంకటసత్య సుబ్రహ్మణ్యేశ్వర భానుచందర్ ప్రసాద్ గా 1952 మే 31 న భానుచందర్ జన్మించారు. ఆయన తండ్రి మాస్టర్ వేణు ఆ రోజుల్లో పేరు మోసిన…
తెలుగు చిత్రసీమలో మాస్ హీరోగా తనదైన బాణీ పలికించిన కృష్ణ ‘హీరో’ కృష్ణగా, నటశేఖర కృష్ణగా, ఆ పై సూపర్ స్టార్ కృష్ణగా సాగారు. తెలుగునాట 325 పై చిలుకు చిత్రాల్లో నటించిన నటునిగా ఓ రికార్డ్ సాధించారు. తెలుగు సినిమా రంగానికి సాంకేతికంగా సినిమాస్కోప్, టెక్నికలర్ వంటి అంశాలను అందించిన ఘనత కూడా కృష్ణ సొంతం. నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా, ఎడిటర్ గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు కృష్ణ. ఆయన నటవారసునిగా మహేశ్ బాబు…
ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టం కట్టే మనసు తెలుగువారి సొంతం. భాషాభేదాలు లేకుండా టాలెంట్ ను గుర్తించడంలో ముందుంటారు మన తెలుగువారు. అందువల్లే ఎంతోమంది పరభాషా తారలు మన చిత్రసీమలో జేజేలు అందుకుంటున్నారు. ఇతర భాషలకు చెందిన వారి దృష్టి సైతం తెలుగు సినిమావైపే సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ తమిళనటుడు శివకుమార్ తనయులు సూర్య, కార్తీ ఇద్దరూ తెలుగునాట కూడా రాణిస్తున్నారు. సూర్య ముందుగానే వచ్చి, తెలుగువారిని అలరించినా, ఆయన తమ్ముడు కార్తీ మాత్రం తెలుగు…
ఏ రంగంలోనైనా ప్రఖ్యాతి గాంచిన వారివద్ద పనిచేసి, వారికి తగిన శిష్యులు అనిపించుకోవడం అంత సులువు కాదు. తెలుగు సినిమా రంగం విషయానికి వస్తే – ‘గురువు గారు’ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది దర్శకరత్న దాసరి నారాయణరావే! ఆయన శిష్యప్రశిష్యులు తెలుగు చిత్రసీమలో రాణిస్తున్నారు. అదే తీరున ఆయన సమకాలికులైన కె.రాఘవేంద్రరావు శిష్యగణం కూడా తెలుగు సినిమా రంగంలో అలరిస్తూనే ఉన్నారు. రాఘవేంద్రుని శిష్యుల్లో ఎందరో జైత్రయాత్రలు చేశారు. గురువుకు తగ్గ శిష్యులు అనిపించుకున్నారు. వారిలో…
మోహన్ లాల్ – ఈ పేరు మళయాళ సీమలో ఓ సమ్మోహనం! ముద్దుగా బొద్దుగా ఉంటూనే పాత్రకు పరిమితమైన అభినయాన్ని ప్రదర్శిస్తూ మోహన్ లాల్ సాగుతున్నారు. కేరళ వాసులు కేరింతలు కొడుతూ మోహన్ లాల్ చిత్రాలను ఆదరిస్తున్నారు. వారిని అలరించేందుకు తన ప్రతి చిత్రంలోనూ వైవిధ్యానికి పెద్ద పీట వేస్తున్నారు మోహన్ లాల్. కొన్ని తెలుగు చిత్రాలలోనూ నటించి ఆకట్టుకున్నారాయన. మాతృభాష మళయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలలోనూ మోహన్ లాల్ నటించి మురిపించారు.…