యువ రచయిత శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించిన సినిమా ‘వాంటెడ్ పండుగాడ్’. సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, సప్తగిరి, శ్రీనివాసరెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో సుడిగాలి సుధీర్ ఓ కీ-రోల్ ప్లే చేశాడు. మే 19న సుధీర్ పుట్టిన రోజును పురస్కరించుకుని చిత్ర బృందం సినిమాలోని అతని గెటప్ ను రివీల్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలియచేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఇటీవల అనసూయ భరద్వాజ్ పుట్టిన…
శృంగార తారగా కోట్లాది మంది మదిని దోచిన సన్నీ లియోన్ వెండితెరపైనా తనదైన బాణీ పలికించింది. నీలి చిత్రాలతో కుర్రకారును కిర్రెక్కించిన సన్నీ లియోన్, సినిమాల్లోనూ తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ నీలి సుందరి చిత్రసీమలో అడుగుపెడుతున్న సమయంలో పలు విమర్శలు వినిపించాయి. అన్నిటినీ చిరునవ్వుతో పక్కకు నెట్టి, బిగ్ స్క్రీన్ పైనా, తన అందంతో హిందోళం పాడించింది సన్నీ లియోన్. ఈ నాటికీ ఎంతోమంది రసికాగ్రేసరుల శృంగార రసాధిదేవతగా జేజేలు అందుకుంటూనే ఉంది సన్నీ లియోన్.…
మే 11వ తేదీ సూపర్ స్టార్ కృష్ణ చిన్నల్లుడు, హీరో సుధీర్ బాబు బర్త్ డే! దాంతో అతను నటిస్తున్న సినిమాల పోస్టర్స్ బర్త్ డే విషెస్ తో వస్తున్నాయి. అయితే అందుకు భిన్నంగా సుధీర్ బాబు – హర్షవర్థన్ కాంబినేషన్ లో మూవీని నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి. సంస్థ టైటిల్ ను ప్రకటించింది. ఇప్పటికే సెట్స్ పై ఉన్న ఈ సినిమాకు ‘మామా మశ్చీంద్ర’ అనే పేరు ఖాయం చేశారు. విశేషం ఏమంటే…
తెలుగునాట పుట్టి, తమిళనాట తడాఖా చూపించిన వారెందరో ఉన్నారు. అలా తమిళ చిత్రాల్లో స్టార్ హీరోగా తనదైన బాణీ పలికించిన ఘనుడు అజిత్ కుమార్. తలకు రంగు కూడా వేసుకోకుండా, తాను ఎలా పడితే అలా నటించినా అజిత్ చిత్రాలు తమిళ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. ‘తల అజిత్’ గా తమిళనాట తనదైన సక్సెస్ రూటులో సాగిపోతున్నారు అజత్. ఆయన నటించిన అనేక చిత్రాలు తెలుగులోకి అనువాదమై అలరిస్తున్నాయి. అజిత్ 1971 మే 1న సికిందరాబాద్…
అనేక తెలుగు చిత్రాలలో అక్క, వదిన, పిన్ని, అత్త, అమ్మ పాత్రల్లో ఒదిగిపోతూ అందరినీ అలరించారు నటి సురేఖా వాణి. ఇప్పటికీ పలు చిత్రాలలో సురేఖ కేరెక్టర్ రోల్స్ లో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వర్ధమాన తారల చిత్రాలలో సురేఖా వాణి ఏదో ఒక పాత్రలో తప్పకుండా కనిపిస్తూ ఉంటారు. తనదైన అభినయంతో ఆకట్టుకుంటూ సురేఖ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు. సురేఖా వాణి 1977 ఏప్రిల్ 29న విజయవాడలో జన్మించారు. చిన్నతనం నుంచీ సురేఖ…
పాత్ర నచ్చితే చాలు “ఊ…” అనడమే తెలుసు, “ఊహూ…” అని మాత్రం అనరు. అదీ సమంత బాణీ! అందం, చందం, అభినయం అన్నీ కుదిరిన సమంత తనదైన పంథాలో పయనిస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా సాగుతున్న సమంత ప్రస్తుతం పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’లో శకుంతల పాత్ర పోషిస్తున్నారు. ప్రేక్షకులకు వైవిధ్యమైన పాత్రలతో వినోదం పంచడానికి సమంత సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగానే ‘మహానటి’లో సహాయ పాత్రలోనూ మెప్పించారు. ఇప్పుడు శకుంతలగా అలరించే ప్రయత్నమూ చేస్తున్నారు.…
ప్రతిభ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి మరీ పట్టం కట్టడంలో తెలుగువారికి సాటి మరెవరూ రారు. అలా పరభాషల్లో రాణించేవారిని సైతం పట్టుకు వచ్చి తెలుగు చిత్రాలలో తగిన అవకాశాలు కల్పిస్తూంటారు మనవాళ్ళు. నటి నిత్య మీనన్ సైతం అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్నా, తెలుగు భాషను నచ్చి మెచ్చి, నటించడంతోనే కాదు, తన గళంతోనూ ఆకట్టుకుంది. 1988 ఏప్రిల్ 8న బెంగళూరులో పుట్టిన నిత్య మీనన్ మాతృభాష మళయాళం. చిన్న తనం నుంచీ అన్నిటా చురుగ్గా ఉండే…
తాత ఏయన్నార్ మహానటుడు. తండ్రి నాగార్జున టాప్ స్టార్. అన్న నాగచైతన్య యంగ్ హీరోస్ లో తనకంటూ ఓ స్థానం సంపాదించాడు. ఇక మిగిలింది అక్కినేని అఖిల్ వంతు. ఏడాది దాటిన వయసులోనే అఖిల్ ‘సిసింద్రీ’గా జనాన్ని మెప్పించాడు. అప్పటి నుంచీ అక్కినేని ఇంట మరో ప్రతిభావంతుడు పుట్టాడని జనం భావించారు. దోగాడే పసిపాపగా ఉన్న రోజుల్లోనే అలరించిన అఖిల్ కథానాయకునిగానూ మెప్పిస్తాడని అభిమానులు ఆశించారు. ఎందుకనో వారి ఆశలు అంతగా ఫలించలేదు. గత యేడాది ‘మోస్ట్…
వైవిధ్యానికి మారు పేరు రామ్ గోపాల్ వర్మ అంటారు అభిమానులు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అన్నది అనేకుల మాట. రామ్ గోపాల్ వర్మ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన లేవనెత్తే వివాదాలే! ఒకటా రెండా ఏదో విధంగా వార్తల్లో నిలవడమే వర్మకు మహా ఇష్టం. ఎవరో ఒకరిని అడ్డంగా విమర్శించి వివాదానికి తెరలేపుతారాయన. తద్వారా తన తాజా చిత్రాలకు ఆ వివాదాలనే ప్రచారంగానూ మలచుకుంటారు. దటీజ్… వర్మ అనిపిస్తారు! తొలి చిత్రం ‘శివ’తోనే ఎంతోమందిని…
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఇప్పటికే బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లను లైన్లో పెట్టింది. నేడు రష్మిక బర్త్ డే సందర్భంగా మేకర్స్ అధికారికంగా ప్రకటించి రష్మికకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ సి. అశ్వనీదత్ నిర్మాణంలో ఒక పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న…