ఎందరో ప్రతిభావంతులు తమదైన బాణీ పలికిస్తూ తెలుగు సినిమా రంగంలోనూ రాణిస్తున్నారు. కోరుకున్న తీరాలను చేరుకొని ఆనందిస్తున్నారు. అలాంటి వారిలో దర్శకుడు కొరటాల శివ ఒకరు. ఆరంభంలో రచయితగా అలరించన కొరటాల శివ ‘మిర్చి’ సినిమాతో దర్శకుడయ్యారు. తొలి చిత్రంతోనే జయకేతనం ఎగరేశారు. మొన్న ‘ఆచార్య’తో మొదటి మల్టీస్టారర్ నూ జనం ముందు నిలిపారు. కొరటాల శివ 1975 జూన్ 15న గుంటూరు జిల్లా పెదకాకానిలో జన్మించారు. కొరటాల శివలో ప్రతీ అంశాన్ని హేతువాద కోణంలో పరీక్షించే…
! మేనల్లుడికి మేనమామ పోలికలు వస్తే పేరు ప్రఖ్యాతులు లభిస్తాయని అంటారు. సంగీత దర్శకుడు, నటుడు జి.వి. ప్రకాశ్ కుమార్ ను చూస్తే, ఆ నానుడి నిజమే అనిపిస్తుంది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్.రహమాన్ అక్క రెహనా ఏకైక కుమారుడే ప్రకాశ్ కుమార్. రెహనా కూడా గాయని. తల్లి, మేనమామ బాటలోనే ఆరంభంలో ప్రకాశ్ గళం విప్పి పాటలు పాడేవాడు. జి.వి. ప్రకాశ్ 1987 జూన్ 13న మద్రాసులో జన్మించాడు. మేనమామ స్వరకల్పన చేసిన పలు చిత్రాలలో…
“ఎక్కడ పారేసుకుంటామో, అక్కడే వెదకాలి” అంటారు పెద్దలు. గోపీచంద్ మనసు చిత్రసీమలో పారేసుకున్నాడు. కాబట్టి, అక్కడే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తపించాడు. చివరకు అనుకున్నది సాధించి, హీరోగా విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మాస్ హీరోగా పలు చిత్రాలలో జనాన్ని అలరించిన గోపీచంద్, ఓ నాటి ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ తనయుడు! టి.కృష్ణ దర్శకత్వంలో అనేక అభ్యుదయ చిత్రాలు రూపొంది విజయం సాధించాయి. వాటిలో ‘ప్రతిఘటన’ చిత్రం మరపురానిది. తొట్టెంపూడి గోపీచంద్ 1979 జూన్ 12న ప్రకాశం జిల్లా…
నటసింహం నందమూరి బాలకృష్ణ నటజీవితాన్ని పరిశీలిస్తే అబ్బురం అనిపిస్తుంది. ఇప్పుడున్న నటుల్లో బాలకృష్ణనే సీనియర్. ఎన్నెన్నో అపూర్వ విజయాలు, అనితరసాధ్యమైన రికార్డులు బాలయ్య కెరీర్ లో చోటు సంపాదించాయి. బాలయ్య పని అయిపోయింది అన్న ప్రతీసారి ఆయన అనూహ్య విజయాలను సొంతం చేసుకున్నారు. అందుకు ఆయన నటించిన ‘అఖండ’ తాజా ఉదాహరణగా చెప్పవచ్చు. వసూళ్ళ పరంగానే కాదు, రన్నింగ్ లోనూ బాలకృష్ణ సినిమాల తీరే వేరుగా సాగుతూ ఉంటుంది. ఆయన అభిమానుల తీరు కూడా వేరుగానే కనిపిస్తుంది.…
డింపుల్ కపాడియా… ఈ పేరు ఆ రోజుల్లో ఎంతోమంది రసికాగ్రేసరులకు నిద్రలేని రాత్రులు మిగిల్చింది. అప్పటి డింపుల్ అందాలను తలచుకొని ఈ నాటికీ పరవశించిపోయేవారెందరో ఉన్నారు. అందానికే ఓ ఆలోచన వచ్చి డింపుల్ కపాడియాలా పుట్టిందనీ అనే అభిమానులు లేకపోలేదు. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా వెలుగొందారు డింపుల్ కపాడియా. డింపుల్ కపాడియా 1957 జూన్ 8న ముంబైలో జన్మించింది. ఆమె అసలు పేరు అమీనా. ఆగా ఖాన్ వంశానికి చెందినవారు. ముంబై శాంటాక్రజ్ లోని సెయింట్…
చిత్రవిచిత్రాలకు నెలవు చిత్రసీమ. ఇక్కడ ఒకటి కావాలని వచ్చి, మరోటి అవుతూ ఉంటారు. ఒకలా ఓ సారి వెలుగులు విరజిమ్మి, మరోలా ఇంకోసారి తళుక్కుమనే వారికీ ఇక్కడ కొదువే లేదు. అలా వెలుగొందుతున్నవారిలో ఓ నాటి నటి, ఈ నాటి మేటి డబ్బింగ్ ఆర్టిస్ట్ సరిత గురించి తప్పకుండా చెప్పుకోవాలి. సరిత పలుకుతో ఈ నాటికీ మురిపిస్తున్న చిత్రాలెన్నో వస్తున్నాయి. తాజాగా వచ్చిన ‘సర్కారువారి పాట’లోనూ నదియాకు సరిత గళవిన్యాసాలు అలరించాయి. సరిత పదహారణాల తెలుగమ్మాయి. ఆమె…
తెలుగు చిత్రసీమలో చిరస్మరణీయులు మూవీ మొఘల్ డి.రామానాయుడు. ఆ పేరు తలచుకోగానే ఆయన సాధించిన అపూర్వ విజయాలు ముందుగా గుర్తుకు వస్తాయి. ప్రపంచంలోనే అత్యధిక కథా చిత్రాలను నిర్మించి, గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించిన తీరు మన మదిలో మెదలుతుంది. భారతదేశంలోని 14 భాషల్లో 12 ప్రముఖ భాషల్లో చిత్రాలను నిర్మించి, దేశంలోనూ ఘనతను సాధించారు. అనితరసాధ్యంగా రామానాయుడు సాగిన తీరును గుర్తు చేసుకుంటే మనసు పులకించి పోవలసిందే. అందుకే భావి నిర్మాతలెందరో ఆయననే ఆదర్శంగా…
నవతరం దర్శకుల దృష్టి మొత్తం యువతరాన్ని ఆకట్టుకోవాలన్నదే! అందులో భాగంగానే తమ చిత్రాలలో మోడరన్ థాట్స్ కు తగ్గ దరువులు ఉండాలనీ కోరుకుంటారు. అందుకు తగ్గ పదాలు నిండిన పాటలూ కావాలని ఆశిస్తారు. అలాంటి ఆలోచనలు ఉన్న దర్శకనిర్మాతలకు ‘ఇదిగో…నేనున్నానంటూ’ పాటలు అందిస్తూ ఉంటారు భాస్కరభట్ల. “వచ్చేస్తోంది వచ్చేస్తోంది…” అంటూ బాలకృష్ణ ‘గొప్పింటి అల్లుడు’తో ఆరంభమైన భాస్కరభట్ల పాటల ప్రయాణం ఆ తరువాత భలే ఊపుగా సాగింది. చిరంజీవి ‘ఆచార్య’లో “శానా కష్టం వచ్చిందే…” పాటతోనూ తనదైన…
చూడగానే బాగా పరిచయం ఉన్న అమ్మాయిలా కనిపించే ప్రియమణి అభినయంతో పాటు అందాల ఆరబోతతోనూ అలరించింది. అందువల్లే ప్రియమణి అభిమానగణాలకూ కొదువలేదు. టాలీవుడ్ టాప్ స్టార్స్ తోనూ, యంగ్ హీరోస్ తోనూ ప్రియమణి నర్తించిన తీరు ప్రేక్షకులకు పరమానందం పంచింది. తెలుగు చిత్రాలతోనే వెలుగు చూసిన ఈ కన్నడ కస్తూరి తమిళ చిత్రం ‘పరుతివీరన్’తో ఉత్తమనటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. తన దరికి చేరిన ప్రతీపాత్రకూ న్యాయం చేయాలని తపించింది. దక్షిణాది నాలుగు భాషల్లోనే కాదు,…
పేరుకు తగ్గట్టే గుణశేఖర్ ఓ ప్రత్యేకమైన గుణమున్న దర్శకుడు. సక్సెస్ కోసం పరుగులు తీయరు. అలాగని కమర్షియల్ ఫార్ములానూ వీడరు. చిత్రసీమలో దాదాపు మూడు దశాబ్దాల నుంచీ దర్శకునిగా ఉన్నా, గుణశేఖర్ తీసింది పట్టుమని పన్నెండు సినిమాలే! అయినా వాటిలో అన్నిటా వైవిధ్యం ప్రదర్శించే ప్రయత్నమే చేశారు గుణశేఖర్. గుణశేఖర్ 1964 జూన్ 2న అనకాపల్లి సమీపంలోని నర్సీపట్నంలో జన్మించారు. సినిమాలపై ఆసక్తితో చెన్నపట్నం చేరారు. డి.వి.నరసరాజు, క్రాంతికుమార్, రామ్ గోపాల్ వర్మ వంటి వారి వద్ద…