ఈ తరానికి హెలెన్ అంటే సల్మాన్ ఖాన్ పిన్ని అని, లేదా ఓ సీనియర్ యాక్ట్రెస్ అని మాత్రమే తెలుసు. కానీ, ఆ నాటి ప్రేక్షకులకు హెలెన్ శృంగార రసాధిదేవత! ఐటమ్ గాళ్స్ లో సూపర్ స్టార్ అనిపించుకున్న మేటి డాన్సర్ హెలెన్. ఆ రోజుల్లో హెలెన్ పాట కోసం జనం థియేటర్లకు పరుగులు తీసేవారు. కొన్ని చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు హెలెన్. అయితే వందలాది సినిమాల్లో ఐటమ్స్ తోనే మురిపించారు. హెలెన్ దాదాపు 700…
ప్రస్తుతం డైరెక్టర్ వంశీ అనగానే ఏ కృష్ణవంశీనో, వంశీ పైడిపల్లినో గుర్తు చేసుకుంటారు. కానీ, తెలుగు సినిమా రంగంలో చెరిగిపోని ముద్ర వేసిన వంశీకి వెనుకా ముందూ ఏమీ లేకపోయినా, తన సృజనతో వైవిధ్యం పలికిస్తూ సాగారు. ఈ నాటికీ వంశీ సినిమాను చూడాలని ఉవ్విళ్ళూరేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. మరో మాట ఇక్కడ మరచిపోరాదు, ఈ రోజున మాటలతో మాయ చేస్తున్నవారికి వంశీ చిత్రాల్లోని సంభాషణలే ఆదరువు అన్నా అనతిశయోక్తే! గోదావరి అంటే వంశీకి ప్రాణం.…
తమకు అచ్చి వచ్చిన సినిమాల పేర్లనే ఇంటిపేరుగా మార్చుకొని రాణించిన వారెందరో ఉన్నారు. ‘శుభలేఖ’ సుధాకర్ కూడా అచ్చంగా అలాంటివారే! ఒకప్పుడు రివటలా ఉండే ‘శుభలేఖ’ సుధాకర్, ఇప్పుడు రాటు తేలిన కేరెక్టర్ యాక్టర్! తన దరికి చేరిన పాత్రల్లోకి ఇట్టే పరకాయ ప్రవేశం చేసి మార్కులు కొట్టేస్తూ ఉంటారు. అవి నచ్చినవారు ఆయనను పట్టేసి తమ సినిమాల్లో పెట్టేసుకుంటారు. సుధాకర్ కూడా శక్తివంచన లేకుండా నటించేసి, జనాన్ని మెప్పిస్తుంటారు. మధురగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్పీ…
ఈ తరం ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని నటుడు రాజీవ్ కనకాల. విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారాయన. తెలుగు చిత్రసీమలో నటనా శిక్షణాలయాలకు ఓ క్రేజ్ తీసుకువచ్చిన దేవదాస్ కనకాల, లక్ష్మీ కనకాల తనయుడే రాజీవ్ కనకాల. ఈయన భార్య సుమ ప్రముఖ యాంకర్ గా నేడు దూసుకుపోతున్నారు. రాజీవ్ వైవిధ్యమైన పాత్రలతో తన రూటులో తాను సాగిపోతున్నారు. స్టార్స్ గా జేజేలు అందుకున్న రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్రప్రసాద్ వంటి ఎందరో నటులకు నటనలో శిక్షణ ఇచ్చారు దేవదాస్…
హిందీ చిత్రాలతోనూ వెలుగు చూసిన తెలుగు దర్శకులు ఎందరో ఉన్నారు. వారిలో తాతినేని రామారావు ప్రత్యేక స్థానం సంపాదించారు. మాతృభాష తెలుగులో విజయాలు సాధించిన తాతినేని రామారావు, దక్షిణాదిన సక్సెస్ చూసిన అనేక చిత్రాలను హిందీలో రీమేక్ చేశారు. అక్కడా జయకేతనం ఎగురవేశారు. తాతినేని రామారావు ఎన్ని సినిమాలు తీసినా, ఆయన పేరు వినగానే ‘యమగోల’ డైరెక్టర్ అనేవారు ఉన్నారు. ఆ సినిమాతో తాతినేని రామారావు పేరు మారుమోగి పోయింది. అందుకే ఇప్పటికీ ‘యమగోల’ తాతినేని రామారావుగానే…
నవతరం దర్శకుల్లో తనదైన అభిరుచిని చాటుకుంటూ సాగుతున్నారు జాగర్లమూడి రాధాకృష్ణ. అందరూ ‘క్రిష్’ అంటూ అభిమానంగా పిలుచుకుంటారు. ఆయన కూడా టైటిల్స్ లో ‘క్రిష్’ అనే ప్రకటించుకుంటారు. తన ప్రతి చిత్రంలోనూ ఏదో వైవిధ్యం చూపించాలన్న తలంపుతోనే క్రిష్ పయనిస్తున్నారు. తనకంటూ కొంతమంది ప్రేక్షకులను అభిమానులుగా సంపాదించుకోగలిగారు క్రిష్. జాగర్లమూడి రాధాకృష్ణ 1978 నవంబర్ 10న జన్మించారు. గుంటూరు జిల్లా వినుకొండ వారి స్వస్థలం. అమెరికాలో ఫార్మసీ అండ్ కంప్యూటర్ సైన్సెస్ లో పట్టా పొంది, కొంతకాలం…
టబు తెలుగు చిత్రాలతోనే వెలుగు చూసిన తార. తెలుగునాట టాప్ హీరోస్ అందరితోనూ నటించి ఆకట్టుకున్న అభినేత్రి టబు. ఉత్తరాదిన సైతం నటిగా తానేమిటో చాటుకున్న అందాలతార. రెండు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలచిన టబు, తెలుగు చిత్రసీమలోనూ తనదైన బాణీ పలికించారు. నవంబర్ 4తో టబు యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయడానికే టబు తపిస్తున్నారు. టబు పూర్తి పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మి. 1971…