y.v.s chowdary : యన్టీఆర్ వీరాభిమాని …వైవిఎస్ చౌదరి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ రంగంలోనైనా ప్రఖ్యాతి గాంచిన వారివద్ద పనిచేసి, వారికి తగిన శిష్యులు అనిపించుకోవడం అంత సులువు కాదు. తెలుగు సినిమా రంగం విషయానికి వస్తే – ‘గురువు గారు’ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది దర్శకరత్న దాసరి నారాయణరావే! ఆయన శిష్యప్రశిష్యులు తెలుగు చిత్రసీమలో రాణిస్తున్నారు. అదే తీరున ఆయన సమకాలికులైన కె.రాఘవేంద్రరావు శిష్యగణం కూడా తెలుగు సినిమా రంగంలో అలరిస్తూనే ఉన్నారు. రాఘవేంద్రుని శిష్యుల్లో ఎందరో జైత్రయాత్రలు చేశారు. గురువుకు తగ్గ శిష్యులు అనిపించుకున్నారు. వారిలో వైవిఎస్ చౌదరితో ఆయనది ప్రత్యేకబంధం! ఎలాగంటే రాఘవేంద్రరావు, వైవిఎస్ చౌదరి ఇద్దరి బర్త్ డే మే 23న కావడం విశేషం! గురువు రాఘవేంద్రరావు లాగే పాటల చిత్రీకరణలో చౌదరి సైతం తనదైన బాణీ పలికించాడు.
నటరత్న యన్టీఆర్ కు వీరాభిమాని వైవిఎస్ చౌదరి 1965 మే 23న గుడివాడలో జన్మించారు. బాల్యం నుంచీ రామారావు చిత్రాలు చూస్తూ పెరిగిన చౌదరి చదువులోనూ చురుకైనవాడు. ర్యాంక్ స్టూడెంట్. అయితే ఇంజనీరింగ్ చేయాలనుకున్న చౌదరి మనసును సినిమా రంగం పట్టేసింది. తన అభిమాన నటుడు యన్టీఆర్ తో పలు విజయవంతమైన చిత్రాలు రూపొందించిన కె.రాఘవేంద్రరావును ఎంతగానో అభిమానించేవారు వైవిఎస్. దాంతో మద్రాసు వెళ్ళి రాఘవేంద్రరావును కలసి, ఆయన వద్ద అసోసియేట్ గా పనిచేస్తానని కోరారు. అప్పటికే రాఘవేంద్రరావు వద్ద 17 మంది అసోసియేట్స్ ఉన్నారు. అందువల్ల తరువాత చూద్దాం లే అన్నారు రాఘవేంద్రరావు. అయితే వైవిఎస్ మాత్రం పట్టువదలని విక్రమార్కునిలా పదమూడు రోజులు రాఘవేంద్రరావు ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. కరుణించిన రాఘవేంద్రరావు, చౌదరి దస్తూరీ పరీక్షించారు. చౌదరి చేతిరాత చూసి, తన వద్ద సహాయ దర్శకునిగా స్థానం కల్పించారు. చిత్రమేంటంటే, యన్టీఆర్ కు వీరాభిమాని అయిన వైవిఎస్ చౌదరి, రామారావు తనయులు నిర్మించిన సొంత చిత్రం ‘పట్టాభిషేకం’ ద్వారా అసోసియేట్ గా చేరాడు. ఆ తరువాత రాఘవేంద్రరావు వద్ద పలు చిత్రాలకు అసోసియేట్ గా, కో-డైరెక్టర్ గా పనిచేశారు చౌదరి.
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
చదువుకొనే రోజుల్లో యన్టీఆర్ ను వీరలెవెల్లో అభిమానిస్తూ, ఏయన్నార్ ను వ్యతిరేకించిన చౌదరికి, అక్కినేని తనయుడు నాగార్జున దర్శకునిగా అవకాశం కల్పించారు. ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి’ చిత్రం ద్వారా వైవిఎస్ చౌదరిని దర్శకునిగా పరిచయం చేశారు నాగార్జున. మరింత విశేషమేమంటే, చౌదరి తన తొలి చిత్రంలోనే ఏయన్నార్ ను డైరెక్ట్ చేసే చాన్స్ దక్కించుకున్నారు. చిత్రసీమలోకి వచ్చాక యన్టీఆర్, ఏయన్నార్ మధ్య ఉన్న అనుబంధం గురించి తెలుసుకున్న చౌదరి, ఆ ఇద్దరు మహానటుల వారసులు హరికృష్ణ, నాగార్జునతో ‘సీతారామరాజు’ చిత్రం తెరకెక్కించి అలరించారు. కృష్ణ నటవారసుడు మహేశ్ తో ‘యువరాజు’ తీసి ఆకట్టుకున్నారు.
బాల్యం నుంచీ మహానటుడు యన్టీఆర్ ను విపరీతంగా అభిమానించిన వైవియస్ చౌదరి చిత్రసీమలోనూ అలాగే సాగారు. తాను నిర్మాతగా మారి ‘బొమ్మరిల్లు’ పతాకంపై చిత్రాలను నిర్మించి ఆకట్టుకున్నారు. తన బ్యానర్ లోగో కు ముందే యన్టీఆర్ ‘రక్తసంబంధం’లోని ఫోటోను రంగుల్లో చూపిస్తూ తన అభిమానాన్ని చాటుకున్నారు చౌదరి. యన్టీఆర్ తొలి నటవారసుడు నందమూరి హరికృష్ణను హీరోని చేసి “లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య” చిత్రాలు తెరకెక్కించి మంచి విజయం సాధించారు. ఈ రెండు చిత్రాలతో నిర్మాతగానూ తనదైన బాణీ పలికించారు చౌదరి. రామ్ ను హీరోగా పరిచయం చేస్తూ ‘దేవదాస్’ రూపొందించారు. ఈ సినిమా డైరెక్టుగా 200 రోజులు ప్రదర్శితమై జనాన్ని ఎంతగానో అలరించింది. ఇలా తన చిత్రాలతో ప్రేక్షకులను రంజింప చేసిన చౌదరి ఇప్పుడు మునుపటిలా సినిమాలు రూపొందించడం లేదు. ఆ పై ఆయన తెరకెక్కించిన చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. మళ్ళీ వైవిఎస్ చౌదరి తన చిత్రాలతో అలరిస్తారని ఆయనను అభిమానించేవారు భావిస్తున్నారు. మరి అదెప్పుడో చూడాలి!
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!