ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘హీరో’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా! ఏప్రిల్ 5న 30వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అశోక్ మీడియాతో తన కొత్త సినిమా విశేషాలను పంచుకున్నాడు. ముందుగా ‘హీరో’ ఇచ్చిన అనుభవాన్ని తలుచుకుంటూ, ”దాదాపు రెండేళ్ళ పాటు ఆ ప్రాజెక్ట్ కోసం పనిచేశాం. మొత్తానికి సంక్రాంతికి విడుదల చేసి, ఊపిరి పీల్చుకున్నాం. థియేటర్లో విడుదలైనప్పుడే కాదు ఆ తర్వాత…
ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టుకు వచ్చి పట్టం కట్టడంలో ముందుంటారు తెలుగువారు. పరభాషా నటులకు సైతం పట్టం కట్టి ఆదరించారు. కన్నడనాట జన్మించి తెలుగునాట రాణించిన వారెందరో ఉన్నారు. అలాంటి వారిలో వినోద్ కుమార్ కూడా చోటు సంపాదించారు. తెలుగునాట హీరోగా తనదైన బాణీ పలికించిన వినోద్ కుమార్ ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గా నటిస్తున్నారు. వినోద్ కుమార్ 1963 ఏప్రిల్ 1న మంగళూరులో జన్మించారు. చదువుకొనే రోజుల్లో తమ కన్నడ సీమలోని రాజ్ కుమార్, విష్ణువర్ధన్…
నవతరం కథానాయకుల్లో వచ్చీ రాగానే సందడి చేసిన హీరో విశ్వక్ సేన్ అనే చెప్పాలి. రెండు సినిమాల్లో నటించాడో లేదో, మూడో చిత్రానికే మెగాఫోన్ పట్టేసి డైరెక్టర్ అయిపోయాడు విశ్వక్ సేన్. తన సినిమాల టైటిల్స్ విషయంలోనూ వైవిధ్యం చూపిస్తూ సాగుతున్నాడు విశ్వక్. విశ్వక్ సేన్ అసలు పేరు దినేశ్ నాయుడు. 1995 మార్చి 29న జన్మించాడు. ఆయన తండ్రి కరాటే రాజు అని పేరున్న మార్షల్ ఆర్ట్స్ మాస్టర్. చిన్నతనం నుంచీ తనయుడిలోని సినిమా అభిలాష…
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రమే కనిపిస్తున్నాడు. నేడు చీరి తన 37 వ పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో ఉదయం నుంచి అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం చరణ్ కి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇక తాజాగా చరణ్ కి ఎంతో ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలిపాడు తారక్. ఆర్ఆర్ఆర్ సినిమాతో వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఎంతగా బలపడిందో చెప్పాల్సిన…
విశాల నేత్రాలు, చక్కటి వర్చస్సు, చూడగానే చూపరులను ఆకట్టుకొనే రూపం, అందుకు తగ్గ అభినయం, ఆ రూపానికి తగిన లావణ్యం, దానిని ప్రదర్శిస్తూ సాగే నాట్యం అభినేత్రి శోభనను అందరి మదిలో చోటు సంపాదించుకొనేలా చేశాయి. మళయాళ సీమలో పుట్టినా, తెలుగు చిత్రసీమలో రాణించిన వారెందరో ఉన్నారు. వారిలో నటి, నర్తకి శోభన స్థానం ప్రత్యేకమైనది. తెలుగు చిత్రాలతోనే శోభన మంచి వెలుగు చూశారని చెప్పవచ్చు. నాట్యకళకే అంకితమై దేశవిదేశాల్లో ప్రదర్శనలిస్తూ నేడు ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన…
ప్రతిభ ఉండాలే కానీ, చిత్రసీమ ఏదో ఒకరోజున పట్టం కట్టకుండా మానదు అన్నది నానుడి. ఆ మాటను నమ్మి ఎందరో చిత్రసీమలో రాణించాలని కలలు కంటూ అడుగు వేస్తుంటారు. స్పేస్ ఫిజిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన రవీంద్ర ప్రసాద్ పట్నాయక్ కు కూడా సినిమా రంగంలో వెలిగిపోవాలనే ఆశ ఉండేది. ఆయన ఆశయం దర్శకుడు కావాలన్నది. అయితే చిత్రసీమ చిత్రవిచిత్రాలకు వేదిక. ఆర్పీ పట్నాయక్ డైరెక్టర్ కావాలని అడుగులు వేసినా, అంతకు ముందు నేర్చుకున్న సంగీతం…
‘మనిషికి పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ’ అన్నారు పెద్దలు. అన్న పెద్దవారు పురుషాధిక్య ప్రపంచంలోని జీవులు కాబట్టి, ఆ మాటను మగాడికే అన్వయిస్తూ అలా నుడివారు. కానీ, పట్టుదల ఉన్న మహిళలు కూడా అనుకున్న రంగంలో అలరించగలరని, అందునా గ్లామర్ వరల్డ్ లోనూ మెగా ఫోన్ పట్టి మగాళ్ళకు దీటుగా రాణించగలరని కొందరు నిరూపించారు. అలాంటి వారిలో దర్శకురాలు, రచయిత నందినీ రెడ్డి కూడా చోటు సంపాదించారు. వేళ్ళ మీద లెక్కపెట్టదగ్గ చిత్రాలే తీసినా, నందినీరెడ్డి…
చూడగానే ముద్దుగా బొద్దుగా ఉంటూ మురిపించి, మైమరిపించారు రజనీ అందం. ఆమె ముద్దుమోముకు తగ్గ నవ్వులు నాట్యం చేసేవి. చిత్రసీమలో ‘నవ్వుల రజనీ’గానే పిలిచేవారు. 1985 ప్రాంతంలో తెలుగువారి ముందు నిలచిన రజనీ అందం, చందం నాటి రసికులకు బంధం వేశాయి. వచ్చీ రాగానే రజనీ బాగా పరిచయమున్న అమ్మాయిలా ఆకట్టుకున్నారు. ఇక ఆమె చలాకీ నటన మరింతగా జనాన్ని కట్టిపడేసింది. అప్పటి టాప్ హీరోస్ లో చిరంజీవి మినహాయిస్తే, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ అందరి సరసనా…
తెలుగునాట పుట్టి, తమిళనాట అడుగుపెట్టి, మళయాళ సీమలో తన స్వరవిన్యాసాలతో ఆకట్టుకున్న ఘనుడు మన విద్యాసాగర్. మాతృభాషలో కన్నా మిన్నగా పరభాషల్లోనే పదనిసలు పలికించి, పులకింప చేశారాయన. విద్యాసాగర్ పరభాషల్లో పలికించిన స్వరాలను మన తెలుగువారు కాపీ చేసిన సందర్భాలూ ఉన్నాయి. కళలకాణాచిగా పేరొందిన విజయనగరంలో రామచంద్రరావు అనే సంగీతకళాకారుని తనయునిగా 1963 మార్చి 2న జన్మించారు విద్యాసాగర్. తండ్రి వద్దనే కర్ణాటక సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న విద్యాసాగర్ తరువాత ఇతర గురువుల వద్ద మరింత సాధన…
నందమూరి నటవంశంలో హీరోలుగా ప్రయత్నించిన వారు కొందరే! అయితే వారిలో నటరత్న యన్టీఆర్ వారసులుగా తనయుడు బాలకృష్ణ, మనవడు జూనియర్ యన్టీఆర్ స్థాయిలో రాణించినవారు లేరు. అయితే నటరత్న మరో మనవడు నందమూరి తారకరత్న చిత్రసీమలో హీరోగా అడుగుపెట్టడంతోనే ఓ రికార్డును తన సొంతం చేసుకున్నారు. ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే ఒకే రోజు తొమ్మిది చిత్రాల ప్రారంభోత్సవం చూశారు. ఆ తొమ్మిది చిత్రాలలో తరువాత వెలుగు చూసినవి కొన్నే! అందులో విజయాలు చూసినవి లేవనే…