అలాగ వచ్చి, ఇలాగ ఎగసిపడిన హీరోహీరోయిన్లు ఎందరో ఉన్నారు. వరుణ్ సందేశ్ కెరీర్ ను చూసినా, ఉవ్వెత్తున ఎగసిన కెరటం గుర్తుకు వస్తుంది. తరువాత ఉసూరుమని కూలిన వైనమూ వరుణ్ కెరీర్ లో దాగుంది. అప్పట్లో నవతరం కథానాయకునిగా అలరించిన వరుణ్ సందేశ్ ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో అలరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. వరుణ్ సందేశ్ 1989 జూలై 21న ఒరిస్సాలోని రాయగడలో జన్మించాడు. నాలుగేళ్ళు ఇండియాలోనే ఉన్న తరువాత వారి కుటుంబం అమెరికాకు…
తెలుగు చిత్రసీమ నవ్వుల నావలో పకపకలు పండించిన వారు ఎందరో ఉన్నారు. అయితే కథానాయకునిగా అధిక సంఖ్యలో నవ్వుల పువ్వులు పూయించిన మేటి నటకిరీటి రాజేంద్రప్రసాద్! ఒకప్పుడు హీరోగా కితకితలు పెట్టిన రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గానూ నవ్వులు పూయిస్తూనే ఉన్నారు.
నవతరం హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుని సాగుతున్నాడు సత్యదేవ్. తాజాగా ‘గాడ్సే’తో జనం ముందుకు వచ్చిన సత్యదేవ్ వైవిధ్యం కోసం తపిస్తూ ఉంటాడని ఇట్టే తెలిసిపోతుంది. సత్యదేవ్ కంచరణ 1989 జూలై 4న వైజాగ్‌లో జన్మించారు. విశాఖపట్నంలోనే ఇంటర్మీడియట్ దాకా చదువుకున్న సత్యదేవ్ విజయనగరంలోని ‘ఎమ్.వి.జి.ఆర్. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్’లో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ చేశారు. 2016 దాకా ఐబీయమ్, వియమ్ వేర్ సంస్థల్లో పనిచేసిన సత్యదేవ్ తరువాత సినిమాలపై ఆసక్తి పెంచుకున్నాడు. కొన్ని లఘు…
కొందరికి సినిమా అయస్కాంతం లాంటిది. వారిలోని ప్రతిభ అనే ఇనుప రజను ఎక్కడికో వెళ్ళాలనుకున్నా, ఇక్కడికే ఆకర్షిస్తూ ఉంటుంది. తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి కృష్ణమూర్తి చిత్రసీమలో అభిరుచిగల నిర్మాతగా సాగారు.
ప్రతిభ ఎక్కడ ఉన్నా, పట్టుకు వచ్చి మరీ పట్టం కట్టడంలో తెలుగువారు అందరికంటే ముందుంటారు. ఇక సినిమా రంగంలోవారినైతే మరింతగా ఆదరిస్తారు. అలా తెలుగువారి ఆదరణ చూరగొంటున్న అదృష్టవంతుల్లో తమిళ టాప్ స్టార్స్ లో ఒకరైన విజయ్ చోటు సంపాదించాడు. నిజానికి విజయ్ ఒక్క తెలుగు చిత్రంలోనూ హీరోగా నటించలేదు. కానీ, ఆయన నటించిన సినిమాలు తెలుగులోకి అనువాదమై ఇక్కడి వారినీ అలరిస్తున్నాయి. విజయ్ కి తెలుగు సినిమా రంగంతో సంబంధం లేదని చెప్పలేం. ఎందుకంటే విజయ్…
ఈ మధ్య ప్రముఖ దర్శకుడు జయంత్ సి.ఫరాన్జీ ఓ సారి ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు దగ్గరకు వెళ్ళి ఆయనతో ఫోటీ తీసుకున్నారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అనేక చిత్రాల్లో ఎంతో చెలాకీగా కనిపించిన పరుచూరి వెంకటేశ్వరరావు, అంత ముసలివారా అని అందరూ అవాక్కయ్యారు. ఎంతోమంది దర్శకుల తొలి చిత్రాలకు పరుచూరి సోదరులు రచన చేసి అలరించారు. అలాగే జయంత్ మొదటి సినిమా’ ప్రేమించుకుందాం…రా’ కు కూడా…
చదివిన చదువుకు, చేసే ఉద్యోగానికి పొంతనలేని జీవితాలు ఉంటాయి. ముఖ్యంగా కళారంగంలో అలాంటి జీవులు కనిపిస్తూఉంటారు. చిత్రసీమలో అలా సాగుతున్నవారెందరో! అలాంటి వారిలో యువ దర్శకుడు సంపత్ నంది తానూ ఉన్నానని చాటుకున్నాడు. అతను చదివిందేమో బి.ఫార్మసీ, చిత్రసీమలో అడుగు పెట్టి రచయితగా, యాడ్ ఫిలిమ్ మేకర్ గా, దర్శకునిగా, నిర్మాతగా సాగుతున్నాడు. పట్టుమని ఐదంటే ఐదు చిత్రాలకు దర్శకత్వం వహించిన సంపత్ నంది, నిర్మాతగానూ సాగుతున్నారు. సంపత్ నంది 1980 జూన్ 20న తెలంగాణలోని ఓదెలలో…
బాలతారలుగా భళా అనిపించి, నాయికలుగానూ మెప్పించిన వారున్నారు. అలాంటి వారిలో తనకంటూ ఓ స్థానం సంపాదించారు తులసి. పిన్నవయసులోనే కెమెరా ముందు అదురూ బెదురూ లేకుండా నించుని డైరెక్టర్స్ చెప్పినట్టుగా చేసేసి మురిపించిన తులసి, తరువాత నాయికగానూ కొన్ని చిత్రాల్లో మెరిశారు. ప్రస్తుతం అమ్మ పాత్రల్లో అలరిస్తున్నారు. తులసి 1967 జూన్ 20న మద్రాసులో జన్మించారు. చిన్నప్పటి నుంచీ ఎంతో చురుగ్గా ఉండేది తులసి. ఆమె తల్లికి అంజలీదేవి, సావిత్రి మంచి స్నేహితులు. ‘భార్య’ అనే సినిమాలో…
తెలుగునాటనే తన కెరీర్ కు వెలుగుబాటలు వేసుకుంది కాజల్ అగర్వాల్. పెళ్ళయ్యాక మరింత అందంగా మారింది కాజల్ అంటూ అభిమానులు కీర్తిస్తూ ఉంటారు. కాజల్ తెరపై కనిపిస్తే చాలు అని అభిమానులు ఈ నాటికీ ఆశిస్తూ ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే కాజల్ ఓ బిడ్డ తల్లయినా, ఇంకా కెమెరా ముందు నటించడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంది. కాజల్ అగర్వాల్ 1985 జూన్ 19న ముంబైలో జన్మించింది. కన్నవారు ఆమెను అన్నివిధాలా ప్రోత్సహించేవారు. ఎమ్.బి.ఏ చదివి మార్కెటింగ్ లో…
ఆరడగుల అందం, పసిమిఛాయ, చూడగానే ఆకట్టుకొనే రూపం, విలక్షణమైన చిరునవ్వు అరవింద్ స్వామి సొంతం. తెరపై అరవింద్ స్వామిని చూడగానే ఎందరో ముద్దుగుమ్మలు మనసు పారేసుకున్నారు. శ్రీదేవి లాంటి అందగత్తె సైతం ఈ అరవిందుని చేయి అందుకోవాలని ఒకానొక సమయంలో ఉవ్విళ్ళూరింది. దీనిని బట్టే అప్పట్లో అరవింద స్వామి క్రేజ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం తన వయసుకు తగ్గ పాత్రలు పోషిస్తూ సాగుతున్నారు అరవింద్ స్వామి. అరవింద్ స్వామి 1970 జూన్ 18న చెన్నైలో…