అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్ష ఎన్నికలకు ఆయన నామినేషన్ వేస్తారనే ఊహాగానాల మధ్య, పార్టీ చీఫ్ రేసులో తాను లేనని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ శుక్రవారం తెలిపారు.
congress president elections: కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు చెప్పారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ కూడా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం లేదని శుక్రవారం ఆయన తెలిపారు. నేను పోటీ చేయాలనుకుంటున్నానని.. త్వరలోనే నామినేషన్ దాఖలు చేస్తానని అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్షం బలంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
congress presidential election triggered a crisis in the Rajasthan: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు రాజస్థాన్ కాంగ్రెస్ లో చిచ్చు పెట్టేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో సీఎం అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలెట్ వర్గాల మధ్య పొసగడం లేదు. సీఎం అశోక్ గెహ్లాట్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న తరుణంలో తదుపరి సీఎంగా సచిన్ పైలెట్ బాధ్యతలు చేపడుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. సచిన్ పైలెట్ సీఎం పదవి కోసం పావులు కదుపుతున్నారు. అయితే…
Congress President Elections: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ విడుదలైంది. ఇక పోటీలో ఎవరెవ్వరు ఉంటారనేదానిపై సస్పెన్స్ నెలకొంది. ఈ సారి కాంగ్రెస్ అధ్యక్ష పదవి దూరంగా ఉండాలని గాంధీ కుటుంబం భావిస్తోంది. ఎన్నికల్లో కలుగచేసుకోవద్దని.. అర్హత ఉన్నవారు పదవికి పోటీ చేయాలని గాంధీ కుటుంబం పార్టీ నేతలకు చెబుతోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై రాహుల్ గాంధీ మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాను పోటీలో ఉండటం లేదని.. ఇప్పటికే ఈ విషయాన్ని చాలా…
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది… ఎల్లుండి కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.. ఇక, ఈ నెల 24వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనుండగా… అక్టోబర్ 17వ తేదీన ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక జరగనుంది.. అయితే.. తాజా పరిణామాలు మాత్రం ఉత్కంఠ రేపుతున్నాయి.. ఓవైపు రాహుల్ గాంధీయే పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని తీర్మానం చేస్తూ వస్తున్నాయి పలు రాష్ట్రాల పీసీసీలు.. కానీ, గాంధీయేతర కుటుంబానికి అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది జీ…
బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్రపై విమర్శనాస్త్రాలు సంధించారు. 'భారత్ తోడో యాత్ర' అని రాహుల్ గాంధీ తన ప్రయాణంలో భారతదేశ వ్యతిరేక వ్యక్తులతో సమావేశమవుతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ బుధవారం అన్నారు. ప్రస్తుతం తనకు రెండు పనులు అప్పగించబడ్డాయని ఆయన తెలిపారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లోత్ సోదరుడు అగ్రసేన్ గెహ్లోత్ ఇంట్లో శుక్రవారం ఉదయం సీబీఐ సోదాలు నిర్వహించింది. జోధ్‌పూర్‌లోని ఆయన ఇంటితో పాటు, ఆయన కార్యాలయాల్లో కూడా ఈ తనిఖీలు చేపట్టినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించారు. తాజాగా వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈ తనిఖీలు జరిపినట్లు చెప్పాయి. కాగా అగ్రసేన్ గెహ్లాట్‌పై ఎరువుల ఎగుమతుల్లో అవకతవకల ఆరోపణలున్నాయి. గతంలో ఎరువుల కుంభకోణానికి సంబంధించి ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్…
కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్న రాజస్థాన్లో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి.. పలు సందర్భాల్లో సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.. అధిష్టానం జోక్యంతో చల్లబడినట్టు కనిపిస్తున్నా.. ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ.. అక్కడ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడుతూనే ఉంది.. ఇక, సచిన్ పైలట్ గురువారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన తర్వాత.. సీఎం అశోక్ గెహ్లాట్ చేసిన ప్రకటన రాజస్థాన్ కాంగ్రెస్ నాయకత్వంలో మార్పు తప్పదనే ఊహాగానాలకు…