Rajyavardhan Singh Rathore: గాంధీ కుటుంబం దేశాన్ని విభజించడంలో ప్రసిద్ధి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajyavardhan Singh Rathore: బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్రపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘భారత్ తోడో యాత్ర’ అని రాహుల్ గాంధీ తన ప్రయాణంలో భారతదేశ వ్యతిరేక వ్యక్తులతో సమావేశమవుతున్నారని ఆరోపించారు. “గాంధీ కుటుంబం భారతదేశాన్ని విభజించడంలో ప్రసిద్ధి చెందింది. అది కాశ్మీర్‌లో అధ్వాన్నమైన పరిస్థితిని సృష్టించిన జవహర్‌లాల్ నెహ్రూ అయినా, దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన ఇందిరా గాంధీ అయినా లేదా సిక్కు అల్లర్లకు నాయకత్వం వహించిన రాజీవ్ గాంధీ అయినా. వారు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తోంది” అని రాథోడ్ అన్నారు.
రాజస్థాన్ కాంగ్రెస్‌కు అన్ని వేళలా కుటుంబానికి మద్దతు ఇవ్వడం తప్ప మరో బాధ్యత లేదని అశోక్ గెహ్లాట్‌ను ఉద్దేశించి రాజ్యవర్ధన్ రాథోడ్ అన్నారు. రాష్ట్రంలోని సర్కారు సమస్యలపై శ్రద్ధ చూపడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో మహిళల భద్రత, లంపి డిసీజ్ వంటి అనేక ప్రధాన సమస్యలు ఉన్నాయన్నారు. రాజస్థాన్ నేడు అల్లర్లకు కేంద్రంగా మారిందన్నారు. రాజస్థాన్‌లో అత్యాచారాల సంఘటనలు పెరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. అయితే ఇవి కాంగ్రెస్‌కు చిన్న సంఘటనలు.. కానీ ఒక కుటుంబాన్ని ప్రశ్నిస్తే అది వారికి పెద్ద సమస్య అవుతుందంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ యాత్ర గురించి రాథోడ్ మాట్లాడుతూ.. దేశాన్ని ఏకం చేస్తున్నట్లు కాంగ్రెస్ నటిస్తోందన్నారు.
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
West Bengal: రణరంగాన్ని తలపించిన పశ్చిమ బెంగాల్.. పోలీసుపై దాడి వీడియో వైరల్
రాహుల్‌గాంధీ భారత వ్యతిరేక పాస్టర్‌తో సమావేశమై హిందూ సమాజం, ఆర్‌ఎస్‌ఎస్‌పై విపరీతమైన ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్‌లో చీలిక ఉందని.. మొదట కాంగ్రెస్‌ను కలిపి పని చేయాలని రాహుల్‌కు సూచించారు. ప్రజలు తమను తిరస్కరించారని వారు విచారంగా ఉన్నారన్నారు. ‘బీజేపీ అధికారంలో ఉన్న చోట ఎలాంటి అల్లర్లు లేవని, ప్రతి పథకం ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుతుందని, కాంగ్రెస్ హయాంలో దేశం విడిచి వెళ్లిన ప్రజలు తిరిగి భారత్‌కు వస్తున్నారని, ఇప్పుడు ఆర్థికంగా బలమైన దేశాల్లో భారత్ ఒకటి’ అని కేంద్ర మాజీ మంత్రి అన్నారు. చైనా కమ్యూనిస్టులతో కాంగ్రెస్ చేతులు కలిపిందని ఆరోపించారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!