రాజస్థాన్‌లో గౌతమ్ అదానీ రూ. 60వేల కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ప్రకటించారు. ఆ ప్రకటనను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్వాగతించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ రగడ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తాత్కాలిక కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఇవాళ ఢిల్లీలో సమావేశం కానున్నారు.
Rajasthan Political Crisis: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపుతున్నాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు పార్టీ అధ్యక్ష పదవిలో పోటీ చేస్తారని అనుకుంటున్నప్పటికీ.. ఆయన సీఎం పదవిని వదిలిపెట్టేందుకు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. సచిన్ పైలెట్ సీఎం కావడం అశోక్ గెహ్లాట్ కు మొదటినుంచి ఇష్టం లేదు. సచిన్ పైలెట్ ను ముఖ్యమంత్రి చేయవద్దనే డిమాండ్ పై గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు మొండిగా వ్యవహరిస్తున్నారని.. పార్టీ పరిశీలకుడు అజయ్ మాకెన్ అన్నారు.…
తన సొంత గడ్డపై సమస్య తలెత్తడంతో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడాన్ని వాయిదా వేసే అవకాశం ఉందని పలు వర్గాలు తెలిపాయి.
రాజస్థాన్ రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. రాజస్థాన్ సీఎం మార్పు రాజకీయం తీవ్ర సంక్షోభానికి దారితీసింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ముంగిట ఆ పార్టీకి కొత్త సమస్య ఎదురైంది.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు నామినేషన్ వేయడానికి ముందే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం జరగనున్న ఎన్నికల కోసం నామినేషన్ల దాఖలు ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు.