డివిజనల్ హెడ్‌క్వార్టర్‌కు దూరంగా నివసించే ప్రజల అవసరాలను తీర్చడానికి 19 కొత్త జిల్లాలు, మరో మూడు డివిజనల్ హెడ్‌క్వార్టర్‌లను ఏర్పాటు చేయనున్నట్లు రాజస్థాన్ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన ప్రకటన చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇప్పుడు పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించే పనిలో ఆప్ అధినేత కేజ్రీవాల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
Ashok Gehlot: రాజస్థాన్ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తీవ్ర వివాదానికి కారణం అయింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాష్ట్ర బడ్జెట్ చదవడం ప్రారంభించిన తర్వాత ఇది గతేడాది బడ్జెట్ ప్రసంగం అని ప్రతిపక్ష బీజేపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సీఎం పాత బడ్జెట్ ను చదువుతున్నారని ఆరోపించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో సీఎం అశోక్ గెహ్లాట్ కొన్ని నిమిషాల పాటు పాత బడ్జెట్ ను చదివారు. ఎట్టకేలకు కాంగ్రెస్ మంత్రి మహేష్…
తన నియోజకవర్గానికి చెందిన వ్యక్తితో ఆస్తి వివాదంపై క్రిమినల్ బెదిరింపు, కిడ్నాప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్ మంత్రి రాజేంద్ర సింగ్ గూడా, తనను తప్పుడు కేసులో ఇరికిస్తున్నారని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై మండిపడ్డారు.
రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ల మధ్య రగులుతున్న రాజకీయ వివాదాల గురించి తెలిసిందే. ఈ గొడవల మధ్య రాజస్థాన్ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Cylinder Blast: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో వివాహ వేడుకలో సిలిండర్ పేలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 32కి పెరిగింది. మరో నలుగురు వ్యక్తులు ఇక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
Rahul Gandhi blamed AAP for Congress' defeat in Gujarat elections: గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి గురించి తొలిసారి స్పందించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రాజస్థాన్ లో భారత్ జోడో యాత్రలో ఉన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కారణం అని నిందించారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్, బీజేపీ పార్టీకి బీ-టీమ్ గా వ్యవహరించిందని దుయ్యబట్టారు.
ఝలావర్‌లో జరిగిన భారత్ జోడో యాత్ర కార్యక్రమంలో ఇద్దరు కాంగ్రెస్ నేతలు వేదికపై రాహుల్ గాంధీతో కలిసి గిరిజన నృత్యంలో పాల్గొనడానికి చేతులు జోడించి నృత్యం చేశారు. ఒకే వేదికపై సీనియర్ నేతలైన రాహుల్ గాంధీ ,అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్, కమల్ నాథ్‌లు స్టెప్పులు వేయడం గమనార్హం.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ వర్గాల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మరోసారి తన వ్యతిరేక గళం వినిపించారు.
రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో రుణాల చెల్లింపుల కోసం బాలికలను వేలం వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై విచారణ కోసం జాతీయ మహిళా కమిషన్ (ఎన్సిడబ్ల్యూ) శుక్రవారం ఇద్దరు సభ్యులతో నిజ నిర్ధారణ బృందాన్ని ఏర్పాటు చేసింది.