ఏపీలో జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనలో నవరత్నాలు నకిలీ రత్నాలుగా, రంగు రాళ్లుగా , గులక రాళ్ళుగా, గుండ్రాళ్ళుగా మారాయన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. పేదలందరికీ ఇళ్లు నవరత్నాలలో ఒక అంశం. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 60 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు అందచేశామన్నారు. కానీ జగన్ మూడేళ్ల పాలనలో మంజూరైన ఇళ్లు 15.60 లక్షలు కాగా, పూర్తి అయినవి కేవలం 60,783 మాత్రమే అన్నారు.…
ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకత్వం విచిత్రమైన పరిస్ధితిని ఎదుర్కోంటోంది. గత ఎన్నికల్లో 11 స్ధానాలను గెలుచుకోగా… రెబల్ ఎమ్మెల్యే చేరికతో ఆ సంఖ్య పన్నెండుకు పెరిగింది. సంస్ధాగతంగా పార్టీ పటిష్టతకు, జిల్లా అభివృద్ధికి బాటలు వేసుకునే అవకాశం లభించింది. మంత్రివర్గ పునర్విభజన తర్వాత జిల్లాకు రెండు కీలకమైన పోర్ట్ ఫోలియోలు లభించాయి. గ్రామీణ అభివృద్ధి, ప్రజలతో నేరుగా సంబంధాలు వుండే మంత్రిత్వ శాఖలు కావడంతో నాయకత్వంలోనూ కొత్త ఆశలు చిగురించాయి. కానీ… క్షేత్ర స్ధాయిలో…
ఏపీలో ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేస్తుందన్నారు విజయనగరం జెడ్పీ ఛైర్మన్ మజ్జి చిన్ని శ్రీనివాస రావు. రహదారులు పాడైపోయాయి.. అభివృద్ధి చేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నారు. ముఖ్యంగా విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో పలు కార్యక్రమం చేపట్టామన్నారు. మా ప్రజాప్రతినిధులు పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. జిల్లాలో పలు గ్రామాలలో రోడ్డు బాగోలేవన్నది ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. 426 కిలో మీటర్ల పరిధిలో రోడ్లు 127 కోట్లతో వేయబోతున్నాం. టెండర్ల ప్రక్రియ పూర్తయింది. పనులు…
కృష్ణాజిల్లా రాజకీయాలు హాట్ హాట్ గా వుంటాయి. అందునా అధికార పార్టీ వైసీపీలో అయితే ఎంపీ, మాజీ మంత్రి మధ్య ఏర్పడిన పంచాయతీ ఎట్టకేలకు అధిష్టానం దృష్టికి చేరింది. ఒకవైపు ఎంపీ బాలశౌరిని అడ్డుకుంది పేర్ని నాని వర్గం. మరోవైపు మాజీ మంత్రి పేర్ని నాని ఆగడాలను మీడియాకు ప్రెస్ నోట్ రూపంలో విడుదల చేసింది బాలశౌరి వర్గం. దీంతో రాజకీయం హాట్ హాట్ గా మారింది. రచ్చ రోడ్డెక్కటంతో రంగంలోకి దిగింది వైసీపీ అధిష్టానం. మీడియా…
ఉమ్మడి కడప జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండేది. YS ప్రభంజనంలో చతికిలపడ్డ తెలుగుదేశం పార్టీ ఇప్పటిదాకా కోలుకోలేదు. నాడు వైఎస్ చేతిలో.. రెండు దఫాలుగా జగన్ చేతిలో ఓడి.. షెడ్డుకు చేరింది సైకిల్. అప్పట్లో అధికారంలో ఉండి కూడా ఒక్కటంటే ఒక్క సీటు గెల్చుకోలేకపోయింది టీడీపీ. 2004లో ప్రొద్దుటూరులో లింగారెడ్డి ఒక్కరే గెలిచారు. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ కేడర్ ఎక్కడికక్కడ సర్దుకుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా కీలక పదవులు వెలగబెట్టిన వారంతా అధికారం దూరం…
టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి జయప్రద చుట్టూ ప్రస్తుతం ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. రాజమండ్రిలో బీజేపీ నిర్వహించిన గోదావరి గర్జన సభలో ఆమె తళుక్కుని మెరిశారు. రాజమండ్రి తన జన్మభూమి అయితే.. ఉత్తరప్రదేశ్ తన కర్మభూమి అని సభలో జయప్రద చేసిన కామెంట్స్ చర్చగా మారాయి. వచ్చే ఎన్నికల్లో ఆమె రాజమండ్రి నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. రాజమండ్రిలో పుట్టిన జయప్రద చదువంతా ఇక్కడే సాగింది. పదో తరగతి వరకు…
సోము వీర్రాజు. ఏపీ బీజేపీ చీఫ్. కోనసీమలో పర్యటనలో భాగంగా అమలాపురం వెళ్దామని అనుకున్నారు. కానీ.. అక్కడ అల్లర్లు జరగడంతో బయట ప్రాంతాల వారిని రానివ్వడం లేదు. సెక్షన్ 30తోపాటు సెక్షన్ 144 అమలులో ఉన్నాయి. దాంతో ఆయన్ని జొన్నాడ దగ్గర అడ్డుకున్నారు పోలీసులు. అయితే బీజేపీకి చెందిన మహిళా నేత తల్లి చనిపోతే పరామర్శకు వెళ్తున్నానన్నది వీర్రాజు చెబుతున్న రీజన్. ఇక్కడే మరో అంశం కూడా ప్రచారంలో ఉంది. అమలాపురానికి చెందిన బీజేపీ నేత బాలయ్య…