శంకర్ నారాయణ. సీఎం జగన్ కేబినెట్ వన్‌లో అనుకోకుండా చోటు సంపాదించిన మంత్రుల్లో ఒకరు. అనంతపురం జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఉన్న కురుబ సామాజికవర్గం కావడంతో ఎలాంటి ప్రయత్నం చేయకుండానే 2019లో మినిస్టర్ అయ్యారు. మంత్రిగా ఉన్నన్ని రోజులు బాగానే నడిచింది. పెనుకొండ నియోజకవర్గంలో చాపకింద నీరులా ఉన్న వర్గపోరు.. శంకరనారాయణ మంత్రి పదవి పోయాక కానీ బయట పడలేదు. ఎవరైతే ఆయన గెలుపునకు బ్యాక్ బోన్‌గా ఉన్నరో వారే ఇప్పుడు వ్యతిరేకంగా మారారట. శంకరనారాయణ మంత్రిగా…
చాలాకాలం తర్వాత ఏపీపై బీజేపీ హైకమాండ్‌కు ఫోకస్ పెట్టింది. ఈ రాష్ట్రాన్ని కూడా ముఖ్యమైన రాష్ట్రాల జాబితాలో చేర్చిందా..? అనే స్థాయిలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా రెండు రోజులు ఏపీలో పర్యటించారు. రాష్ట్రంలో బీజేపీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలో కార్యకర్తలకు ఆయన దిశా నిర్దేశం చేశారు కూడా. ఈ సందర్భంగా అధికారపార్టీపై తీవ్ర విమర్శలు చేశారాయన. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ నినాదాన్ని కూడా తెలుగులో వినిపించారు నడ్డా. వైసీపీ పోవాలి.. బీజేపీ…
మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసులో ఎమ్మెల్సీ అనంతబాబును గత నెల 23న అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ సమయంలో కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఆ గడువు ఈ నెల 6తో ముగిసింది. అయితే రిమాండ్ ముగియక ముందే ఆన్లైన్లో విచారణకి హాజరవుతానని మెజిస్ట్రేట్‌ను అభ్యర్థించారు ఎమ్మెల్సీ. ప్రజాప్రతినిధి కావడంతో భద్రతను కారణంగా చూపారు. కేసు తీవ్రత దృష్ట్యా మెజిస్ట్రేట్ ఎమ్మెల్సీ అభ్యర్థనను తిరస్కరించారు. ఇంకేముందీ అనంతబాబు కోర్టుకి హాజరవడం ఖాయమనే ప్రచారం జరిగింది. ఎస్సీ…
ఉపఎన్నిక జరుగుతున్న ఆత్మకూరు అసెంబ్లీ సెగ్మెంట్లో క్రమంగా పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2 లక్షల 13 వేల మంది. 2014లో ఇక్కడ వైసీపీకి 33 వేలు, 2019లో 22 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. మేకపాటి గౌతంరెడ్డి అకాల మరణంతో వచ్చిన ఉపఎన్నికలో ఆయన సోదరుడు విక్రంరెడ్డే వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో వచ్చిన మెజారిటీ ఎలా ఉన్నా.. ఉపఎన్నికలో మాత్రం లక్ష ఓట్ల ఆధిక్యం సంపాదించాలనే పట్టుదలతో ఉన్నారు నాయకులు.…
ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ ఎపిసోడ్ నడుస్తోందా? అంటే అవుననే చెప్పాలి. ఒకవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో పర్యటించారు. మాజీ మంత్రి పేర్ని నాని బీజేపీపై చేసిన విమర్శలపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఫైరయ్యారు. మాది పువ్వు పార్టీనా.? అడ్డంగా బలిశారంటూ మా నడ్డాను వ్యక్తిగతంగా విమర్శిస్తారా..? మాజీ మంత్రులివి ఒళ్లు బలిసిన మాటలు. మీదే డబ్బా ఫ్యాన్ పార్టీ.. చెత్త ఫ్యాన్ పార్టీ. డబ్బా ఫ్యాన్ తమ నెత్తి మీద ఎప్పుడు…
ఒకటి బీజేపీ – టీడీపీ – జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయటం.రెండోది టీడీపీ – జనసేన కలిసి ప్రభుత్వం స్థాపించటం.మూడోది జనసేన ఒంటరిగా అధికారంలోకి రావటంఈ మూడు ఆప్షన్లే ఉన్నాయంటున్నారు వపన్ కల్యాణ్..పొత్తుల విషయంలో తానే కాదని..టీడీపీ కూడా తగ్గాల్సిన అవసరం ఉందని స్పష్టంగా చెప్పారు.పొత్తుల విషయంలో గతంలో వన్‌సైడ్ లవ్ అంటూ కామెంట్స్ చేసిన చంద్రబాబుకు పరోక్ష సంకేతాలు ఇచ్చారు పవన్ కల్యాణ్. గతంలో కుప్పంలో ఓ ర్యాలీలో కార్యకర్తల ప్రశ్నలకు చంద్రబాబు ఆసక్తికరంగా…
పవన్ కామెంట్లు టీడీపీని డిఫెన్సులో పడేసినట్టే కన్పిస్తోంది. పార్టీ ఆవిర్భావ సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా జాగ్రత్త పడతాననే పవన్ కామెంట్లతో, తమతో కలిసి పని చేయడానికి సంసిద్దతను పవన్ తన కామెంట్ల ద్వారా తెలిపారని జనమంతా భావించారు. అదే తరహాలో టీడీపీ కూడా అనుకుంది. ఆ తర్వాత ఒకట్రెండు సందర్భాల్లో కూడా పవన్ ఇదే తరహాలో మాట్లాడితే పొత్తు పక్కా అని తమ్ముళ్లూ ఫిక్స్ అయినట్టే కన్పించారు. చంద్రబాబు ఏం కోరుకుంటున్నారో, దానికి అనుగుణంగానే…
కేఏ పాల్.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడైన ఆయన తెలుగు రాష్ట్రాల్లో సంచలన కామెంట్లకు కేరాఫ్ అడ్రస్. తాజాగా ఆయన జనసేనాని పవన్ కళ్యాణ్ కు బంపర్ ఆఫర్ ప్రకటించారు. పవన్ తన జనసేన పార్టీని వదిలి ప్రజాశాంతి పార్టీలో చేరితే ఎమ్మెల్యేనో, ఎంపీగానో గెలిపిస్తానన్నారు. గెలిపించలేకపోతే రూ.1000 కోట్ల నజారానా ఇస్తానన్నారు. పవన్ సొంతంగా పోటీ చేసినా మరే ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసినా గెలవడని కేఏ పాల్ తేల్చిచెప్పారు. పవన్ బీజేపీతో పొత్తులో ఉండి…
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ, గత నెల 24న అమలాపురంలో విధ్వంసకాండ జరిగింది. అల్లర్లలో మంత్రి విశ్వరూప్ క్యాంపు కార్యాలయం, ఇల్లు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇంటికి నిప్పు అంటించారు ఆందోళనకారులు. ఆ ఘటన రాష్ట్రంలో సంచలనం స్రుష్టించింది. ఏకంగా మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యే ఇళ్లకు నిప్పు పెట్టడం సంచలనమైంది. పార్టీ కూడా తీవ్రంగా పరిగణించింది. కానీ అప్పటి నుంచి మంత్రి, ఎమ్మెల్యే ను కనీసం పలకరించేవారే కరువయ్యారు. సంఘటన…