YCP : కోనసీమ జిల్లా ఎస్పీ పై వేటుకు అసలు కారణాలేంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత నెల 24న కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టవద్దని చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. ఆ అల్లర్లలో పోలీసులు కూడా గాయపడ్డారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇంటెలిజెన్స్ విఫలమైందనే విమర్శలు వచ్చాయి. ఆందోళనకారులను.. వారు చేసే విధ్వంసాన్ని పోలీసులు అంచనా వేయలేకపోయారు. ఈ సందర్భంగా కోనసీమ ఎస్పీ సుబ్బారెడ్డి తీరు చర్చకు వచ్చింది. ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన 72 రోజుల తర్వాత ఆయన్ని బదిలీ చేశారు. దీంతో అమలాపురం అల్లర్లు.. తర్వాత జరిగిన పరిణామాలు ఆసక్తిగా మారాయి. ఎస్పీ వేటుకు దారితీసిన సంఘటనలు పోలీస్ వర్గాల్లోనూ చర్చకు కారణం అయ్యాయి.
సుబ్బారెడ్డి డైరెక్ట్ IPS కాదు. అందువల్లే డిపార్ట్‌మెంట్‌పై ఆయన పట్టు సాధించలేకపోయారనే విమర్శ ఉంది. కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో ఆయనకు ఎస్పీగా అవకాశం వచ్చింది. కానీ.. పూర్తి స్థాయిలో కమాండింగ్ చేయలేక ఇబ్బంది పడ్డారని చెబుతారు. కొన్ని సందర్బాలలో డీఎస్పీ స్థాయి అధికారి కూడా ఎస్పీ సుబ్బారెడ్డి చెప్పిన ఆదేశాలు పాటించేవారు కాదని పోలీస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అందుకే అమలాపురం అల్లర్ల తర్వాత DIG పాలరాజును రంగంలోకి దించారని విశ్లేషిస్తారు. గత నెల 24నే ఆయన అమలాపురం చేరుకుని.. అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు. ఉమ్మడి జిల్లాకు ఎస్పీగా పని చేసి.. ప్రస్తుతం కాకినాడ జిల్లా ఎస్పీగా ఉన్న రవీంద్రబాబును కూడా అమలాపురం పంపించారు.
Also Read
అల్లర్ల తీవ్రత ప్రపంచం మొత్తం చూసినా.. డీజీపీ స్థాయి అధికారులు అమలాపురం రాకపోవడంతో మంత్రి విశ్వరూప్ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారట. దాంతో ఘటన జరిగిన 15 రోజుల తర్వాత డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి అమలాపురం వచ్చారని చెబుతారు. ఆందోళనకారులు తగులబెట్టిన మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లను డీజీపీ పరిశీలించారు. ఆ తర్వాత ఎస్పీ ఆఫీసులో అల్లర్లపై సమీక్ష నిర్వహించారు డీజీపీ. సమగ్ర వివరాలు ఇవ్వాలని అప్పటికప్పుడు ఎస్పీ సుబ్బారెడ్డిని ఆదేశించారు DGP. అంతా DIGనే చూస్తున్నారని సంజాయిషీ ఇస్తూ.. ఆ ఘటనపై ఎలాంటి వివరాలు ఇవ్వలేదట ఎస్పీ. దాంతో మీ జిల్లా పరిధిలోని విషయాలు మీకు తెలియకపోతే ఎలా అని ఎస్పీపై సీరియస్ అయ్యారట DGP.
నలుగురు అనుచరులు తన ఇంటిపై దాడి చేశారని స్వయంగా మంత్రి విశ్వరూప్ ఎస్పీకి చెప్పారట. దర్యాప్తు చేసి క్లారిటీ ఇవ్వాలని కోరారట. ఆ విషయంలోనూ సుబ్బారెడ్డి చూసీచూడనట్టు వ్యవహరించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అమలాపురం వచ్చిన డీజీపీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారట మంత్రి. విచిత్రం ఏంటంటే.. డీజీపీ వచ్చి వెళ్లిన మరుసటి రోజే విశ్వరూప్ అనుచరులపై కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో కేర్‌లెస్‌గా వ్యవహరించడం ఏంటని ఎస్పీకి డీజీపీ క్లాస్ తీసుకున్నారట. ఆ తర్వాత సుబ్బారెడ్డిని బదిలీ చేశారని చర్చ జరుగుతోంది.
మొత్తానికి ఎస్పీ బదిలీ వేటుకు ముందు జరిగిన ఘటనల కంటే.. తర్వాత జరిగిన పరిణామాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. డీజీపీకి కనీసం సమాచారం ఇవ్వకపోవడంతో ఎస్పీని పక్కన పెట్టారని అనుకుంటున్నారట. మొత్తానికి అసలు కథ ఇదా అని ఖాకీ వర్గాలు గట్టిగానే చెవులు కొరుక్కుంటున్నాయట.
తాజావార్తలు
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
-
British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!