పర్చూరులో కౌలు రైతుల భరోసా యాత్ర సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. పవన్ కళ్యాణ్ గెలిపించిన టీడీపీ ప్రభుత్వం రైతులను దగా చేసింది వాస్తవం కాదా?? ఇప్పుడు రైతుల ఇబ్బందులకు అప్పటి ప్రభుత్వం చేసిన మోసం కాదా?? అప్పుడు రైతుల గురించి ఎందుకు ప్రశ్నించలేని నాని ప్రశ్నించారు.
అధికారంలో ఉన్నా… ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీని ప్రశ్నించటమే పవన్ కళ్యాణ్ కు తెలుసు. పవన్ కళ్యాణ్ పార్టనర్ గా ఉన్న కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు ఏం ప్రయోజనం చేస్తోంది దేశంలో? పాచిపోయిన లడ్డు అని విమర్శించిన బీజేపీతో పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎందుకు చేతులు కలిపారు? స్పెషల్ స్టేటస్ ఇచ్చారా? విశాఖ స్టీల్ ప్లాంట్ పై హామీ వచ్చిందా? తమ పార్టీ ఆవిర్భావ సమయంలో ఏం చెప్పారు? కాంగ్రెస్ జగన్ పై సీబీఐతో అక్రమ కేసులు పెట్టారని బీజేపీ నాయకులు పార్లమెంటు వేదిక పైనే చెప్పారు. ఇవి అక్రమ కేసులని ప్రజలు నమ్మబట్టే 151 సీట్ల భారీ మెజారిటీ ఇచ్చారన్నారు.
పవన్ కళ్యాణ్ కు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం లో కౌలు రైతుల కోసం చట్టం చేయించాలి. చంద్రబాబు దత్త పుత్రుడు కాకపోతే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ విసిరారు పేర్ని నాని. ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తే రాజకీయ నాయకుడు అయినంత మాత్రాన చర్యలు తీసుకోకూడదా?? ఇది కొత్త సిద్ధాంతం చూస్తున్నాం. నిజమైన బీసీ అయితే ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కబ్జా చేయరు. కల్తీ బీసీ కాబట్టే కబ్జా చేశాడు. లోకేష్‌కు కల్లు తాగిన ముసలి కోతి కూడా పులిలా కనిపిస్తోంది. కళ్ళ డాక్టర్ కు చూపిస్తే మంచిదని ఎద్దేవా చేశారు.