Botsa Satyanarayana : ఏలూరు జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్, శాసనమండలి విపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రభుత్వం పై వరుస ఆరోపణలు చేశారు. కోవిడ్ తర్వాత పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఆలోచనతో మాజీ సీఎం వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించారని, అందులో ఐదు కాలేజీలు నిర్మాణం పూర్తై రెండేళ్లుగా అడ్మిషన్లు కూడా కొనసాగుతున్నాయని ఆయన గుర్తుచేశారు. అయితే తాము నిర్మించిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడానికి…
Perni Nani : కూటమి ప్రభుత్వంపై మరోసారి వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తప్పుడు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు గతంలో ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను మంత్రులుగా ప్రమాణం చేయించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన అన్నారు. మనుషులను ప్రలోభాలకు గురి చేయడంలో చంద్రబాబుకు సరితూగే వ్యక్తి లేరని విమర్శించారు. కొనుగోలుదారులను సిద్ధం చేసి, బయానాలు…
Tiruvuru MLA controversy: తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజక వర్గంలో జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Pawan Kalyan : అమరావతిలో జనసేన పార్టీకి చెందిన లోకసభ సభ్యులు బాలశౌరి, తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌తో ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎంపీలకు అనుసరించాల్సిన వ్యూహాలపై పవన్ కళ్యాణ్ స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. దేశ ప్రయోజనాలను కేంద్రీకరించిన చర్చల్లో సక్రమంగా పాల్గొనడానికి ముందస్తు సన్నాహాలు చేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేసే…
వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పంటల కోసం పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంపై రైతుల్లో ఆందోళన నెలకొంది.. గత ప్రభుత్వ హయాంలో అరటి సాగులో కేంద్రం నుంచి అవార్డు తీసుకున్న రాష్ట్రం మనది.. అలాంటి పరిస్థితి నుంచి రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి ఎందుకు ఇంతలా దిగజారింది.
YS Jagan : కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. రైతుల్ని రోడ్డున పడేశారంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. చంద్రబాబూ.. రికార్డు స్థాయిలో పంటల ధరలు దారుణంగా పతనమైనా మీరు రైతులవైపు కన్నెత్తి చూడ్డం లేదంటూ ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. మీ కారణంగా నెలకొన్న దారుణమైన పరిస్థితులను తట్టుకోలేక, ప్రభుత్వం నుంచి ఏమాత్రం ఆసరాలేక రైతులు తాము వేసిన పంటలను తామే ట్రాక్టర్లతో దున్నివేసే పరిస్థితులు తీసుకు వచ్చారని ఆయన…
Minister Subhash : మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు, సవాళ్లపై మంత్రి సుభాష్ ఘాటుగా స్పందించారు. ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వేణుగోపాల్ శ్రీనివాస్ తన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రి 2023లో తెచ్చిన మెమోలో శెట్టిబలిజలను ‘గౌడ’గా చూపిస్తూ ‘ఉపకులం’గా వర్గీకరించిన విషయాన్ని మంత్రి సుభాష్ ప్రశ్నించారు. “ఈ మెమో అసలు ఎందుకు తెచ్చారు? అధికారులు ఇచ్చారు, నాకు తెలియదు అని చెప్పడం మీకే…
Yanamala Ramakrishnudu: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తునిలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ఎప్పుడూ ప్రతిపక్షం మీద ఒక కన్నేసి ఉంచాలని, ప్రతిపక్షం బలం అనుకుంటేనే మనం పని చేయగలమని అన్నారు యనమల రామకృష్ణుడు.. ప్రతిపక్షం ఏముందిలే ఊదితే ఎగిరిపోతారు అనుకుంటే పొరపాటు అని.. ప్రతిపక్షం ఊదితే మనం ఎగిరిపోతామని కార్యకర్తలను హెచ్చరించారు.. అయితే, మెడికల్ కాలేజ్ ల నిరసనలో ప్రతిపక్షంలో కసి పెరిగిందని.. ర్యాలీ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ మారిపోయారా? ప్రభుత్వ వ్యవహారాలు, తాజా రాజకీయ పరిస్థితులపై ఇన్నాళ్ళు కాస్త కామ్‌గా ఉన్న పవన్ ఇక స్పీడైపోవాలని నిర్ణయించుకున్నారా? అందుకే వాయిస్ పెంచుతున్నారా? ఈ తాజా మార్పునకు కారణం ఏంటి? ఉప ముఖ్యమంత్రి వైఖరిలో ఎలాంటి తేడాలు కనిపిస్తున్నాయి? Also Read:OnePlus 15: పిచ్చెక్కించే ఫీచర్లతో OnePlus 15 రిలీజ్.. 7300mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ప్రభుత్వ వ్యవహారాల్లో పట్టు బిగిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్……
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు పోలీసులు.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధారం రోజు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించిన విషయం విదితమే కాగా.. ర్యాలీ కి అనుమతి లేదంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబును అడ్డుకున్నారు పోలీసులు.. దీంతో, పోలీసులతో వాగ్వాదానికి దిగారు రాంబాబు.. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను నెట్టి వేసి తన అనుచరులను తీసుకెళ్లారు.. ఈ నేపథ్యంలో పోలీసులు,…