మాజీ మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షుడిగా.. కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు సీఎం రేసులో నిలబడిన కన్నా లక్ష్మీనారాయణ మౌనం కేడర్‌కు అర్థం కావడం లేదట. గతంలో ఆయన పెదకూరపాడు నుంచి నాలుగుసార్లు వరసగా గెలిచారు. రాజకీయ సమీకరణల్లో భాగంగా గుంటూరు పశ్చిమ ప్రాంతంతో అనుబంధం పెంచుకున్నారు. 2009లో అక్కడి నుంచి కూడా గెలిచారు కన్నా. మంత్రిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన 2014 రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో కొంత ఇబ్బంది పడ్డారు.…
చిక్కాల రామచంద్రరావు. టీడీపీ సీనియర్ నేత. మొదట నుంచి పార్టీలో ఉన్నప్పటికి ఒక్క ఓటమితో ఆయనకి నియోజకవర్గం అంటు లేకుండా పోయింది. 2012లో చివరిసారిగా అసెంబ్లీకి పోటీ చేసిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో మరోసారి అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తున్నారట. ఇందుకు నియోజకవర్గాన్ని కూడా ఎంచుకుని గ్రౌండ్‌వర్క్ చేసుకుంటుండంతో కాకినాడ జిల్లా టీడీపీలో ఒక్కసారిగా చర్చల్లోకి వస్తున్నారు. తాళ్లరేవు నుంచి 1983లో తొలిసారి ఇండిపెండెంట్‌గా గెలిచిన చిక్కాల..1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరసగా సైకిల్ పార్టీ నుంచి…
సోము వీర్రాజు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు. ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు. గతంలో ఎమ్మెల్సీగా చట్టసభల్లో అడుగుపెట్టారు. ఈసారి మాత్రం ఎన్నికల్లో గెలిచి తీరాలనే లెక్కలు వేస్తున్నారట. అందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారట వీర్రాజు. ఆయన సొంతూరు కాతేరు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఉంటుంది. అయితే ఆ నియోజకవర్గం నుంచి పోటీకి పెద్దగా ఆసక్తి చూపడం లేదట. ఒకవేళ అధిష్ఠానం అసెంబ్లీకి పోటీ చేయమంటే రాజమండ్రి అర్బన్ నుంచి బరిలో దిగాలని లెక్కలేస్తున్నారట. దానికి…
స్వేచ్చగా ఉన్నప్పుడు భూతుపురాణం. పోలీసులు గాలిస్తుంటే అజ్ఞాతవాసం. ఇదీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్టైల్. పర్యాటకశాఖ మంత్రి ఆర్కేరోజాను కించపరిచేలా అయ్యన్న కామెంట్స్ చేయడం రాజకీయంగా దుమారం రేగుతోంది. చోడవరం మినీ మహానాడు వేదిక నుంచి ఆయన చేసిన వ్యాఖ్యాలపై అధికారపార్టీ భగ్గుమంది. వ్యక్తిగతంగా అయ్యన్నను టార్గెట్ చేసిన అధికారపార్టీ నేతలు తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డం వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. మహిళా మంత్రినే కాదు పోలీసు అధికారులను అయ్యన్నపాత్రుడు తరచూ ఆక్షేపించడం వివాదాస్పదంగా మారుతోంది. ఉమ్మడి విశాఖజిల్లా…