ఏపీలో 2024 కి ముందే ఎన్నికలు రానున్నాయా? వస్తే ఆయా పార్టీల పరిస్థితి ఎలా వుండబోతోంది. పొత్తుల విషయంలో బీజేపీ. టీడీపీ, జనసేన ఏం చేయబోతున్నాయి. ఏపీ పాలిటిక్స్ ని డిసైడ్ చేసే శక్తి పవన్ కళ్యాణ్ లో ఉందా..? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్కు చేరుకున్నారు. రాష్ట్రంలో రెండు రోజులు పర్యటించనున్న ఆయన.. గవ్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. తొలుత విజయవాడ, రాజమహేంద్రవరంలోని బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం సిద్దార్ధ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేయనున్న బీజేపీ శక్తి కేంద్ర ప్రముఖుల సమ్మేళనంలో ఆర్ఎస్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో పాలు పంచుకోనున్నారు. ఆ వెంటనే ఐదున్నర గంటలకు…
బుర్రా మధుసూదన్. ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే. మూడేళ్లుగా పెద్దగా సమస్యలు లేకుండా రోజులు గడిచిపోయినా.. ఇప్పుడిప్పుడే నియోజకవర్గంలో రివర్స్ కొడుతోందట. ఇన్నాళ్లూ వైసీపీ ద్వితీయశ్రేణి నేతలతో సయోధ్య కుదుర్చుకుని సర్దుబాటు చేసుకున్నారు మధుసూదన్. ఇటీవలే కొత్తగా వైసీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా కట్టబెట్టారు. కానీ.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమమే ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్నాయట. సమస్యలపై కొందరు.. ఇన్నాళ్లూ ఏమైపోయారు అని ఇంకొందరు ప్రశ్నలు సంధిస్తుంటే.. వారితో వైసీపీ కేడర్ కూడా…
ఏపీలో తూర్పుగోదావరి రాజకీయాలు గోదావరి అంత ప్రశాంతంగా వుండవు. తుఫాన్ వచ్చినప్పుడు లంక గ్రామాల్ని ముంచేసినట్టుగా అక్కడ రాజకీయాలు హాట్ హాట్ గా వుంటాయి. తాజాగా జనసేన-వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మంగళగిరిలో జరిగిన జనసేన సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి దాడిశెట్టి రాజా కౌంటరేశారు. అంబేద్కర్ జిల్లా ప్రకటించినందుకు పవన్, చంద్రబాబు అల్లర్లు సృష్టించారన్నారు. మంత్రి, ఎమ్మెల్యే ఇల్లు తగలబెట్టి చంద్రబాబు, పవన్ ఆ మంటల్లో చలికాసుకున్నారు. కోనసీమ అల్లర్లలో…
కాకినాడ జిల్లా పిఠాపురంలో దళిత గర్జనకు టీడీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అనుమతి నిరాకరించిన పోలీసులు. మాజీ ఎమ్మెల్యే వర్మను టీడీపీ ఆఫీస్ లోనే నిర్బంధించారు పోలీసులు. దీంతో ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చిన టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తాళాలు పగలగొట్టి వర్మను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులతో టీడీపీ క్యాడర్ వాగ్వాదానికి దిగింది. టీడీపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం పిఠాపురంలో టీడీపీ కార్యాలయం నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మని ఇంటికి తీసుకుని…
మంగళగిరిలో జనసేన విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. సమావేశంలో పాల్గొన్న జనసేన పీఏసీ సభ్యుడు కొణిదెల నాగబాబు మాజీ మంత్రి అవంతిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైజాగ్ రుషి కొండ వ్యూ చాలా అద్భుతమైనది. రుషి కొండను కొట్టేస్తుంటే ప్రతిఘటించింది జనసేనే. అవంతి శ్రీనివాస్ ఎర్ర కొండలు తినేస్తున్నాడు.ఈ పాటికే ఒక కొండ తినేసి ఉండుంటాడు. పవన్ చెప్పింది వింటే.. మన అధ్యక్షుణ్ని 2024లో సీఎంగా చూడవచ్చన్నారు నాగబాబు. పవన్ ఎక్కడికైనా వెళితే సమస్య తీరుతుందని నమ్మకం…
ఏపీలో ఇంకా ఎన్నికలకు టైం వున్నా.. అధికార. విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. వైసీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ, పార్టీ అధినేత చంద్రబాబు నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. యాభై వేల మంది వచ్చిన మహానాడు ప్రజా విజయం కాదు. మా పార్టీ మంత్రులు బస్సు యాత్రకు వెళ్తే లక్షల మంది జనం వస్తున్నారన్నారు. మీకు నిజంగా ప్రజా బలం ఉంటే ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలి.…
ఏపీలో ఇంకా ఎన్నికలు టైం వుంది. కానీ ప్రధాన ప్రతిపక్షం మాత్రం ముందస్తు ముహూర్తాలు పెట్టేస్తోంది. వైసీపీ నేతలు కూడా ముందస్తు మాట ఎత్తకుండానే ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. 2024 కి కంటే ముందు ఎన్నికలు జరిగినా. జరగకపోయినా ఏపీలో మాత్రం పొత్తులు వుంటాయనేది జగమెరిగిన సత్యం. బీజేపీ-జనసేన కలిసి నడుస్తాయని బీజేపీ నేతలే ఎక్కువగా ప్రకటిస్తున్నారు. తాజాగా అమరావతిలో జనసేనాని పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన-బీజేపీ…
అవినీతి నిర్మూలనపై ‘ఏసీబీ 14400’ యాప్ను సీఎం లాంచ్ చేసిన నేపథ్యంలో టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. రాష్ట్రంలో అవినీతికి చట్టబద్దత కల్పించిన జగన్.. అవినీతి నిర్మూలనపై యాప్ ప్రారంభించటం హాస్యాస్పదంగా ఉందంటూ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న ఎద్దేవా చేశారు. తీవ్రవాద సంస్థలు ప్రవచనాలు చెప్పినట్లు.. జగన్ ఈ అవినీతి యాప్ని విడుదల చేసినట్లుందని పేర్కొన్నారు. మద్యం, ఇసుక ద్వారా జగన్ రూ. 5 వేల కోట్ల అవినీతి డబ్బుల్ని సంపాదించారని ఆరోపించిన…
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో విక్రమ్ రెడ్డికి ముఖ్యమంత్రి జగన్ అవకాశం కల్పించారన్నారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. ఆత్మకూరు అభివృద్ధికి గౌతమ్ ఎంతో కృషి చేశారు.మెట్ట ప్రాంత రైతుల సమస్యలను తెలుసుకుని విక్రమ్ రెడ్డి ముందుకు వెళుతున్నారు. ప్రభుత్వ అభివృద్ధి..సంక్షేమ పథకాలు వల్లే మాకు ఓట్లు వస్తాయి. లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తాం. ఈ ఎన్నికలలో పోటీకి ఎవరూ ముందుకు రావడం లేదు. బీజేపీ నేతలు కూడా పోటీకి భయపడుతున్నారు. వచ్చే రెండేళ్లలో మరింత అభివృద్ధి…