గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉరవకొండలో ఓడినా.. ఇక్కడి వైసీపీలో వర్గపోరు మాత్రం పీక్స్‌లో ఉంది. ఆ పోరు కూడా ఒకే కుటుంబంలోని వైసీపీ నేతల మధ్య కావడంతో ఘర్షణలు.. కేసులు.. వార్నింగ్స్ పరిస్థితిని వేడెక్కిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ఫ్యామిలీ సభ్యులే రోడ్డెక్కి రచ్చ రచ్చ చేస్తున్నారు. విశ్వేశ్వర్‌రెడ్డే ఉరవకొండ వైసీపీ ఇంఛార్జ్. ఇక్కడ ఆధిపత్యం కోసం ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ప్రయత్నించేవారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో శివరామిరెడ్డికి మరోసారి ఛాన్స్ ఇవ్వడంతో ఆయన కామైపోయారు. కానీ.. విశ్వేశ్వర్‌రెడ్డికి ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డి నుంచే పార్టీలో ఇంటిపోరు తప్పడం లేదు. రెండు వర్గాలకు అస్సలు గిట్టడం లేదు. ఎదురుపడితే గొడవలే. విచిత్రం ఏంటంటే.. అన్నదమ్ములు ఇద్దరూ సౌమ్యులైనా.. అనుచురులు పూర్తిగా రివర్స్.
ప్రస్తుతం అన్నదమ్ముల కుమారులు ఈ పోరులోకి ఎంట్రీ ఇచ్చారు. విశ్వేశ్వర్‌రెడ్డి తనయుడు ప్రణయ్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి కుమారుడు అవినాష్‌రెడ్డి, విశ్వ మరో సోదరుడు రవీంద్రనాథ్‌రెడ్డి కుమారుడు నిఖిల్‌నాథ్‌రెడ్డి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే పనిలో ఉన్నారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని తీసుకోవడమే కాదు.. వారి ఆధిపత్యపోరును సైతం బాధ్యతగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఆ మధ్య విశ్వ కుమారుడు ప్రణయ్‌రెడ్డి నిర్వహించిన క్రికెట్ టోర్నీ ముగింపు కార్యక్రమం వివాదంగా మారింది. . ప్రణయ్‌రెడ్డి డ్రైవర్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిఖిల్‌నాతీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడమే కాదు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. తనపై ప్రణయ్‌రెడ్డి డ్రైవర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిఖిల్‌నాథ్‌రెడ్డి గుర్రుగా ఉన్నారు. ఆ విషయంపై ప్రశ్నించేందుకు ప్రణయ్‌రెడ్డి ఇంటికి నిఖిల్ వెళ్లగా అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. తర్వాతి రోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. నిఖిల్‌నాథ్‌రెడ్డి, అవినాష్‌రెడ్డితోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదైంది.
గొడవ పడ్డవాళ్లు.. కేసుల్లో ఇరుక్కున్నవాళ్లు అంతా వైసీపీ వాళ్లే. పైగా ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల కుమారులు ఈ విధంగా తన్నుకోవడం పార్టీ వర్గాల్లో చర్చగా మారింది. వాస్తవానికి విశ్వేశ్వర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డిల మధ్య మొదట్లో ఎలాంటి విభేదాలు లేవు. ఎన్నికల్లో విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపుకోసం మధుసూదన్‌రెడ్డి పనిచేశారు కూడా. అయితే మధ్యలో వచ్చిన చిన్నచిన్న సమస్యలు పెద్దవయ్యాయి. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం వచ్చేసింది. మరి.. ఉరవకొండలో తెలెత్తిన గొడవలను పరిష్కరించేందుకు వైసీపీ పెద్దలు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి.