Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TS Inter Results
  • Draupadi Murmu
  • PM Modi AP Tour
  • Maharashtra Political Crisis
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Off The Record Did That Mla Resign As He Could Not Bear The Onslaught Of Group Politics

YCP : ఆ ఎమ్మెల్యే గ్రూపురాజకీయాల ఉక్కపోత భరించలేక రాజీనామా చేశారా..?

Published Date - 03:36 PM, Thu - 16 June 22
By Sista Madhuri
YCP : ఆ ఎమ్మెల్యే గ్రూపురాజకీయాల ఉక్కపోత భరించలేక రాజీనామా చేశారా..?

రాజకీయాలు అంటేనే గ్రూపులు ఉంటాయి. అందులోనూ అధికారపార్టీ అయితే ఆ సమస్య మరింత జఠిలం. రెండు, మూడు కూటములు ఉంటేనే భరించడం కష్టం. అటువంటిది విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 10వరకు గ్రూపులు ఏర్పడ్డాయి. టీడీపీలో గెలిచి వైసీపీ పంచన చేరిన రెబల్ ఎమ్మెల్యే వాసుపల్లి ఎంట్రీతో ఇక్కడ పాలిటిక్స్ హీటెక్కడం మొదలైంది. ఎమ్మెల్యే అనుచరులు, ముఖ్య నాయకులు పార్టీలో చేరగా.. కొత్తవాళ్లతో సర్దుకుపోవడం ఆవిర్భావం నుంచి వైసీపీ జెండా మోసిన వాళ్లకు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి టిక్కెట్ ఆశించి రంగంలోకి దిగారు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్. ఇది ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు మింగుడు పడటం లేదట.

వాసుపల్లి వైసీపీలో చేరే సమయానికే నియోజకవర్గంలో పార్టీకి ఇంఛార్జ్‌ ఉన్నారు. వాసుపల్లి ఎంట్రీతో వర్గపోరు రాజుకుంది. గతంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే వాసుపల్లి చేసిన విమర్శలను వైసీపీ శ్రేణులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాయట. GVMC ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో సీతంరాజు సుధాకర్‌ మరింత యాక్టివేట్‌ అయ్యారు. ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్న వర్గాలు అంతర్గతంగా ఒకే తాటిపైకి వచ్చే ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. ఎమ్మెల్యే తనకు తాను స్ట్రాంగ్ పాకెట్స్ అని భావిస్తున్నచోట ప్రత్యర్ధులు పాగా వెయ్యడం వాసుపల్లికి ఆవేదన కలిగించింది. ఉమ్మడి విశాఖ జిల్లాల వైసీపీ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన వైవీ సుబ్బారెడ్డి దగ్గరకు మొదటి విడతలోనే దక్షిణ నియోజకవర్గ పంచాయితీ చేరింది.

వాసుపల్లి, సుధాకర్ వర్గాలు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకున్నాయి. ఇరువర్గాల వాదనలు అదుపు తప్పి ఘర్షణ పడే స్థాయికి వెళ్లడంతో బాల్‌ను సీఎం కోర్టులోకి గెంటేశారు సుబ్బారెడ్డి. ఈ చర్యను ఊహించని వాసుపల్లి అప్పటి నుంచి పార్టీతో అంటీ ముట్టనట్టు వ్యవహరించడం ప్రారంభించారు. దీంతో ఎమ్మెల్యే మళ్లీ సొంత గూటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారనే.. ప్రచారం షికారు చేసింది. ఇలాంటి తరుణంలో హైకమాండ్ దగ్గర తన విలువ ఎంతో తెలుసుకోవాలని భావించారో ఏమో ఎమ్మెల్యే వాసుపల్లి రాజీనామా అస్త్రం సంధించారు. అనధికారికంగా చేపట్టిన కోఆర్డినేటర్ పదవిని వదులు కుంటున్నట్టు ఆయన ప్రకటించడం కలకలంగా మారింది. ఏకంగా వైవీ సుబ్బారెడ్డిని కోట్ చేస్తూ ఆయనకే రాజీనామా లేఖను పంపారు. దీన్ని మీరు ఎలా తీసుకున్నా పర్వాలేదని.. ఎలాంటి నిర్ణయానికైనా సిద్దంగా ఉన్నాననీ లేఖ సంధించారు. ఆ లేఖతో టీడీపీకి వాసుపల్లి టచ్‌లో ఉన్నారనే ఊహాగానాలు బలపడ్డాయి.

ఇప్పటికే నరసాపురం, గన్నవరం సహా పలుచోట్ల వర్గ రాజకీయాలు నలుగుతుండగా.. ఎమ్మెల్యే వాసుపల్లి రాజీనామా వెనక ఆంతర్యం పసిగట్టిన అధినాయకత్వం రంగంలోకి దిగింది. సింగిల్ లీడర్ షిప్ మాత్రమే ఉండాలని.. పార్టీ కార్యకలాపాలు ఎమ్మెల్యే తప్ప ఇతరులు నిర్వహించవొద్దని ఆదేశించింది. హైకమాండ్ నుంచి క్లారిటీ వచ్చేయడంతో కలిసి వచ్చే నాయకత్వాన్ని వెంటబెట్టుకుని “గడపగడపకు” ప్రారంభించారు వాసుపల్లి. సీతంరాజు వర్గం అధినాయకత్వం ఆదేశాలను గౌరవిస్తూనే కొత్త ప్రయత్నాలు ప్రారంభించింది. రాజకీయల ఊసు ఎత్తకుండా ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను విస్త్రతం చెయ్యడం మొదలు పెట్టింది. సాంకేతికంగా ఇవేవీ రాజకీయలతో సంబందం లేనట్టే కనిపించినా పెద్దఎత్తుగడ ఉందని ఎమ్మెల్యే వర్గం గ్రహించిందని భోగట్టా.

సీతంరాజు చేపట్టిన ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు అన్నీ బ్రాహ్మణ, నిరుపేదల లక్ష్యంగా జరుగుతున్నాయి. దక్షిణ నియోజకవర్గ పరిధిలో బ్రాహ్మణ, వైశ్య వర్గాల ఓటింగ్ సుమారు 27వేలు ఉంటుందని అంచనా. ఈ లెక్కన సర్వీస్ చేసుకుంటూ వెళ్లడం ద్వారా ఎన్నికల నాటికి తనకంటూ కొంత బలం వస్తుందనేది సీతంరాజు వర్గం ఆలోచనగా ఉందట. టికెట్‌ కేటాయింపు సర్వేల ఆధారంగానే ఉంటుందని హైకమాండ్ చెప్పడంతో అడ్వాంటేజ్ పొందాలనేది ఎమ్మెల్యే వైరివర్గం ప్లాన్. అదే సమయంలో వాసుపల్లి డిఫెన్స్‌లో పడినట్టేనన్న వాదన వినిపిస్తోంది. దీంతో రానున్న రోజుల్లో విశాఖ దక్షిణ వైసీపీ రాజకయాలు పసందుగా మారతాయని అనుకుంటున్నారట.

 

 

  • Tags
  • ap politics
  • sudhakar
  • tdp
  • Vasupalli
  • ycp

RELATED ARTICLES

Pilli Subhash Chandra Bose : సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే నేరగాళ్ళంటారా

Kodali Nani : టీడీపీ నేతలకు చిన్న కర్మకు, పెద్ద కర్మకు తేడా తెలియదు

Chandrababu : పోలవరంపై కేంద్రమంత్రికి చంద్రబాబు లేఖ..

TDP Mahanadu: గుడివాడలో టీడీపీ మహానాడు వాయిదా

Gudivada tension: ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు..గుడివాడలో టెన్షన్

తాజావార్తలు

  • India vs Ireland 2nd T20: భారత్ ఖాతాలో చెత్త రికార్డ్

  • Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. గడువు మరో 6 రోజులే!

  • Udaipur Tailor Case: హంతకులకు అంతర్జాతీయ సంబంధాలు

  • NTR: తారక్ గొప్ప మనసు.. అభిమాని చావుబతుకుల మధ్య ఉంటే..

  • Ponnada Sathish : రాజకీయాలకోసం నాకుటుంబాన్ని బలిపెట్టదలుచుకోలేదు..

ట్రెండింగ్‌

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions