పర్చూరులో కౌలు రైతుల భరోసా యాత్ర సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. పవన్ కళ్యాణ్ గెలిపించిన టీడీపీ ప్రభుత్వం రైతులను దగా చేసింది వాస్తవం కాదా?? ఇప్పుడు రైతుల ఇబ్బందులకు అప్పటి ప్రభుత్వం చేసిన మోసం కాదా?? అప్పుడు రైతుల గురించి ఎందుకు ప్రశ్నించలేని నాని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నా… ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీని ప్రశ్నించటమే పవన్ కళ్యాణ్ కు తెలుసు. పవన్ కళ్యాణ్ పార్టనర్…
అయ్యన్నపాత్రుడు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. చట్టానికి ఎవరూ అతీతులు కాదు. చంద్రబాబు అసలు ఏ పార్టీ నుండి వచ్చారు? టీడీపీలోకి వెళ్లి ఆ పార్టీని కబ్జా చేసిన వ్యక్తి చంద్రబాబు. పార్టీని, బ్యాంకు బ్యాలెన్స్ కబ్జా చేసిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు తరహాలోనే అయ్యన్నపాత్రుడు నడుస్తున్నారు.మీరు తప్పు చేసి దాన్ని బీసీలపై రుద్దటం ఏంటి? బీసీలు సెక్రటేరియట్ కి వస్తే తోక కట్ చేస్తానన్న వ్యక్తి చంద్రబాబు, అలాంటి…
ఆళ్ల నాని. మొన్నటి వరకు ఏపీ డిప్యూటీ సీఎం. ఏలూరు ఎమ్మెల్యే. సీఎం జగన్కు వీర విధేయుడిగా గుర్తింపు ఉంది. మొన్నటి కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో మంత్రి పదవి పోవడంతో కినుక వహించారో ఏమో.. వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడప కార్యక్రమంలో పాల్గొనడం లేదు. ఏలూరులో ఇంత వరకూ ఆ ఊసే లేదన్నది అధికారపార్టీ శ్రేణులు చెప్పేమాట. ఈ రెండేళ్లు జనంలో ఉండాలని.. గ్రాఫ్ పెంచుకోవాలని సీఎం జగన్ సూటిగా సుత్తిలేకుండా చెప్పినా.. ఆళ్ల నానిలో…
శ్రీకాకుళం టీడీపీలో మెదటినుంచీ రెండువర్గాలు. ఒకటి కింజరాపు కుటుంబం.. రెండోది మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ వర్గం. అయినప్పటికీ తనదైనశైలిలో రాజకీయాలు నెరుపుతూ సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసారు అప్పల సూర్యనారాయణ. 2014లో అప్పల సూర్యనారాయణ సతీమణి గుండ లక్ష్మిదేవి ఇరవైవేల ఓట్ల తేడాతో ధర్మాన ప్రసాదరావును ఓడించారు. 2019లో మాత్రం స్వల్ప తేడాతో ఓడిపోయారు. నాటి నుంచి చాపకింద నీరులా పార్టీలో అంతర్గత పోరు కోనసాగుతోందట. నియెజకవర్గం మినీ మహానాడు వేదికగా శ్రీకాకుళం టీడీపీలో మరోసారి…
రాజకీయాలు అంటేనే గ్రూపులు ఉంటాయి. అందులోనూ అధికారపార్టీ అయితే ఆ సమస్య మరింత జఠిలం. రెండు, మూడు కూటములు ఉంటేనే భరించడం కష్టం. అటువంటిది విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 10వరకు గ్రూపులు ఏర్పడ్డాయి. టీడీపీలో గెలిచి వైసీపీ పంచన చేరిన రెబల్ ఎమ్మెల్యే వాసుపల్లి ఎంట్రీతో ఇక్కడ పాలిటిక్స్ హీటెక్కడం మొదలైంది. ఎమ్మెల్యే అనుచరులు, ముఖ్య నాయకులు పార్టీలో చేరగా.. కొత్తవాళ్లతో సర్దుకుపోవడం ఆవిర్భావం నుంచి వైసీపీ జెండా మోసిన వాళ్లకు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో…
డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసులో ఎమ్మెల్సీ అనంతబాబును గత నెల 23న అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అప్పటి నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్నారు. బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ జైలులో ఉన్నప్పటికీ రంపచోడవరం నియోజకవర్గంలో ఏ పనైనా ఆయన కనుసన్నల్లోనే జరుగుతోందట. నియోజకవర్గంలో మొత్తం 11 మండలాలు ఉన్నాయి. రాష్ట్ర విభజనప్పుడు తెలంగాణలోని పోలవరం ముంపు మండలాలు కొన్ని రంపచోడవరం నియోజకవర్గంలో కలిశాయి. రంపచోడవరం వ్యాప్తంగా తనకు నమ్మకంగా ఉన్న అనుచరులతో…
కేశినేని నాని కేంద్రంగా బెజవాడ టీడీపీ రాజకీయం మరోసారి వేడెక్కుతోందా? కొత్తగా కేశినేని వర్సెస్ కేశినేని అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందా? ఎందుకలా? విజయవాడ తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? ఈ ఎపిసోడ్లో మరోవర్గం ఎలాంటి పాత్ర పోషిస్తోంది? కేశినేని నాని వర్సెస్ కేశినేని చిన్ని బెజవాడ టీడీపీలో అగ్గి రాజుకున్నట్టే కన్పిస్తోంది. నిన్నటి వరకు ఎంపీ కేశినేని నాని వర్సెస్ మిగిలిన లీడర్లు అన్నట్టుగా ఉండేది. కేశినేని నానికి వ్యతిరేకంగా బుద్దా వెంకన్న, నాగుల్ మీరా,…
ఆయన అధికారపార్టీ ఎమ్మెల్యే. రాజకీయంగా పదోన్నతి దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నా అవేమీ వర్కవుట్ కాలేదు. కానీ.. తనకంటే జూనియర్లు మాత్రం పదవులు చేపడుతుంటే.. ఎమ్మెల్యేకు నిద్ర పట్టడం లేదట. అనుచరులు స్వరం పెంచుతుంటే.. ఆయన మాత్రం లోలోపలే తెగ కుమిలిపోతున్నారట. ఎవరా ఎమ్మెల్యే? లెట్స్ వాచ్..! ఆవేదనలో ఎమ్మెల్యే చింతల చింతల రామచంద్రారెడ్డి. ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు ఎమ్మెల్యే. గత రెండు ఎన్నికల్లో వరసగా వైసీపీ నుంచి గెలిచారు. అంతకుముందు వాయల్పాడు ఎమ్మెల్యేగానూ పనిచేశారు…
పార్టీ అధికారంలో ఉండగా ఆమెకు నెంబర్వన్ ఎమ్మెల్యేగా పేరు. జిల్లా పార్టీలో కీలకంగా ఉండేవారు. అప్పట్లో పొగిడి పనులు చేయించుకున్న నాయకులే ఇప్పుడు రివర్స్ అవుతున్నారట. గట్టిగానే పొగ పెడుతున్నట్టు టాక్. ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే? సొంత పార్టీలో ఎందుకు ఇబ్బందిగా మారింది? గుండ శిబిరాన్ని కలవరపెడుతున్న పరిణామాలు శ్రీకాకుళం టీడీపీలో మొదటినుంచీ రెండువర్గాలు. ఒకటి కింజరాపు కుటుంబం.. రెండోది మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ వర్గం. అయినప్పటికీ తనదైనశైలిలో రాజకీయాలు నెరుపుతూ సుదీర్ఘకాలం…