తెల్ల రాయి అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై నమోదు చేసిన కేసులో తొందరపాటు చర్యలు చేపట్టకుండా మద్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది.. ఈ కేసులో కాకాణి ఏ 4గా ఉన్నారు.. పోలీసులు రెండుసార్లు నోటీసులు ఇచ్చినా.. కాకాణి సహకరించటం లేదని ప్రభుత్వం.. హైకోర్టుకి తెలియజేసింది..
భీమిలి తీర ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది.. భీమిలి అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో పిల్ దాఖలు చేశారు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్.. విచారణ సందర్భంగా అక్రమ నిర్మాణాలపై కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు..
ఉమ్మడి కడప జిల్లా.. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక వివాదం ఇప్పుడు హైకోర్టు వరకు చేరింది.. జడ్పీ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలంటూ గోపవరం జడ్పీటీసీ జయరాం రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కడప జిల్లాలో ఖాళీగా ఉన్న రెండు జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని తన పిటిషన్లో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో 27,400 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని దాఖలైన పిల్పై విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.. సెక్షన్ 26 విద్యా హక్కు చట్టం కింద టీచర్ పోస్టులు 10 శాతం కంటే ఎక్కువ ఖాళీగా ఉండకూడదనీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. 27 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని కోర్టుకు తెలిపారు..
AP High Court: తిరుమలో నిర్మాణాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన మఠాలపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ చేసింది. తిరుమలలో నిర్మాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని టీటీడీని హెచ్చరించింది.
పోసాని కృష్ణమురళి క్వాష్ పిటిషన్లపై విచారణ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసులో పీటీ వారెంట్ అమలు చేశామని కోర్టుకు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం.. దీంతో, ఈ కేసు క్వాష్ చేయాలన్న పోసాని కృష్ణ మురళి పిటిషన్ను డిస్మిస్ చేసింది హైకోర్టు.. ఇక, విజయనగరం, గుంటూరు, అల్లూరి సీతా రామరాజు జిల్లా పోలీసులు నమోదు చేసిన కేసుల్లో 34 BNS ప్రకారం నోటీసు ఇవ్వాలని ఆదేశాలు జారీ…
సినీ నటుడు పోసాని కృష్ణమురళి హైకోర్టును ఆశ్రయించారు.. తనపై వివిధ జిల్లాలు, ప్రాంతాల్లో నమోదైన కేసులను క్వాష్ చేశాయంటూ పిటిషన్ వేశారు.. అయితే, పోసాని కృష్ణమురళి క్వాష్ పిటిషన్ల మీద విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు.. పీపీలు, ఏపీపీల నియామకంలో జాప్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.. ఈ విషయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది..