AP High Court: ఐపీఎస్ అధికారి జాషువాకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది.. జాషువాపై ఏసీబీ తొందరపాటు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటానికి నిరాకరించింది.. పల్నాడులో స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి డబ్బులు బలవంతంగా వసూలు చేసినట్టు జాషువాపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం విదితే.. అయితే, ఈ కేసు క్వాష్ చేయాలని జాషువా దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. మాజీ మంత్రి విడదల రజిని, ఆమె మరిది విడదల గోపి వసూలు చేసినట్టుగా కేసు నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు జాషువా లాయర్.. అయితే ఒత్తిడి చేసింది మాత్రం అప్పట్లో విధుల్లో ఉన్న జాషువా అని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.. పూర్తి వివరాలు సమర్పించాలని ఏసీబీ అధికారులను ఆదేశించి హైకోర్టు.. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది..
Read Also: Manchu Family Issue : మోహన్ బాబు ఇంటి ముందు మంచు మనోజ్ ధర్నా
కాగా, స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఆరోపణలు రావడంతో.. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఐపీఎస్ అధికారి పి. జాషువా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే.. ఫిర్యాదుదారుడి నుంచి డబ్బు డిమాండ్ చేసినట్టు నాపై ఎలాంటి ఆరోపణలు లేవని.. అవినీతి నిరోధక చట్టం కింద నాపై నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు కావని.. రాజకీయ వర్గాల మధ్య ఉన్న వివాదంలోకి నన్ను లాగారంటూ.. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని నాపై కేసును కొట్టివేయాంటూ ఐపీఎస్ అధికారి జాషువా హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే..