High Tension in Tadipatri: కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట.. తాడిపత్రిలో హై టెన్షన్..!
- తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కి హైకోర్టులో ఊరట..
- తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి..
- తాడిపత్రి వెళ్ళేందుకు కేతిరెడ్డికి షరతులతో అనుమతి ఇచ్చిన కోర్టు..
- పెద్దారెడ్డి - జేసీ ఇంటికి మధ్యలో ఉన్న మైదానంలో టిప్పర్ తో రాళ్లు..
- తాడిపత్రిలో హై టెన్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Tension in Tadipatri: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కి హైకోర్టులో ఊరట దక్కింది.. తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.. సార్వత్రిక ఎన్నికల్లో తాడిపత్రిలో చెలరేగిన అల్లర్లలతో… ఆ రోజు నుంచి తాడిపత్రిలోకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి అనుమతి నిరాకరించారు పోలీసులు.. పోలీసులు తాడిపత్రిలోకి వెళ్ళకుండా అడ్డుకుంటున్నారని… జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ కార్యకర్తలు తన ఇంటిపై దాడికి పాల్పడ్డారని హైకోర్టును ఆశ్రయించిన కేతిరెడ్డి.. అయితే, తాడిపత్రి వెళ్ళేందుకు కేతిరెడ్డికి షరతులతో అనుమతి ఇచ్చింది హైకోర్టు.. తాడిపత్రికి పదుల సంఖ్యలో వాహనాలతో ర్యాలీగా వెళ్ళొద్దని.. కేవలం ఐదు వాహనాల్లో మాత్రమే తాడిపత్రికి వెళ్ళాలని ఆదేశించింది.. మరోవైపు.. తాడిపత్రి వెళ్ళేందుకు కేతిరెడ్డికి తగిన భద్రత కల్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది.. హైకోర్టు ఆదేశాలతో ఎస్పీ జగదీష్ ను కలిసి ఒకటి, రెండు రోజుల్లో తాడిపత్రి వెళ్లేందకు కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్ధం అవుతుండగా.. తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది..
Read Also: Hit3 : 24 గంటల్లో బీభత్సం.. నాని కెరీర్ లోనే రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్‌లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
తాడిపత్రి… ఈ నియోజకవర్గంలోకి అడుగుపెట్టాలంటే నా పర్మిషన్ ఉండాల్సిందే.. మీరు ఎవర్నైనా ఆహ్వానించవచ్చు.. ఆ ఒక్కర్ని తప్ప.. ఇలా చెబుతున్నది ఎవరో కాదు… మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆయన నో ఏంట్రీ బోర్డు పెట్టింది ఎవరికంటే… మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి. ఒక రోజు కాదు రెండు రోజులు కాదు.. ఏకంగా ఏడాది కాలంగా ఇదే తంతు నడుస్తోంది. 2019 ఎన్నికల వరకు దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఏకచత్రాధిపత్యం వహించిన జేసీ ఫ్యామిలీకి 2019 ఎన్నికల్లో బ్రేకు పడింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో తాడిపత్రిలో సరి కొత్త రాజకీయాలు ప్రారంభమయ్యాయి. జేసీ ప్రభాకర్ రెడ్డికి అడుగడుగునా చెక్ పెడుతూ కేతిరెడ్డి తన హవాసాగించారు. ఒకానొక సందర్భంలో పెద్దారెడ్డి నేరుగా జేసీ ఇంటికి వెళ్లి తొడకొట్టారు. ఈ సంఘటన తర్వాత తాడిపత్రిలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇటు పెద్దారెడ్డి, అటు జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య నిత్యం గొడవలే. పోలీస్ ఫోర్స్ లేకుండా తాడిపత్రి ప్రజలకు రోజు గడిచింది లేదు. అలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమే 2024 ఎన్నికలు జరిగాయి…
Read Also: MaheshBabu : SSMB29 కి లాంగ్ బ్రేక్..?
ఈ ఎన్నికల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఓడిపోయారు. ఎన్నికల సమయంలో జరిగిన గొడవలతో కోర్టు.. జేసీ, కేతిరెడ్డి ఫ్యామిలీలు తాడిపత్రిలో అడుగు పెట్టకూడదంటూ ఆంక్షలు విధించింది. కొన్ని రోజులకు ఆ ఆంక్షలు ఎత్తి వేశారు. ఇక్కడ జేసీ అస్మిత్ రెడ్డి గెలిచారు. దీంతో ఊరిలో యధావిధిగా పాలన సాగిస్తున్నారు. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలోకి నో ఎంట్రీ బోర్డు పెట్టారు. ఆయన ఎప్పుడు తాడిపత్రికి వెళ్లాలన్న పోలీసులు అడ్డుకుంటూనే ఉన్నారు. శాంతి భద్రతల సమస్యలు దృష్ట్యా మీరు తాడిపత్రికి వెళ్ళకూడదంటూ పోలీసులు ఎప్పటికప్పుడు ఆంక్షలు విధిస్తూ వచ్చారు. ఇలా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా 8 నెలల నుంచి ఇదే సాగుతోంది. జిల్లా అధికారులను కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో పెద్దారెడ్డి హైకోర్టు తలుపు తట్టారు. హైకోర్టులో ఆయన ఊరట దక్కింది.. మరో వ్తెపు మూడు రోజుల క్రితం తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలంలో ఒక ఫంక్షన్ కు పెద్దారెడ్డిని ఆహ్వానించాడు ఓ నేత. దీంతో జేసీ వారింటికి నేరుగా వెళ్లి మీరు ఎవర్నైనా పిలవండి.. పెద్దారెడ్డిని పిలిస్తే ఊరుకోనంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో శాంతి భద్రత సమస్యలు వస్తాయంటూ నగరూరు నుంచి మాజీ ఎమ్మెల్యే పెద్డారెడ్డిని వెనక్కి పంపించి వేశారు. అయితే గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఘటనలను కేతిరెడ్డి గుర్తుకు తెచ్చుకోవాలంటున్నారు స్థానికులు.
Read Also: CM Revanth Reddy : నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే..?
ఇక, హైకోర్టు ఆదేశాలతో త్వరలో తాడిపత్రి వెళ్లేందకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్ధం అవుతుండగా.. పెద్దారెడ్డి – జేసీ ఇంటికి మధ్యలో ఉన్న జూనియర్ కళాశాల మైదానంలో టిప్పర్ తో రాళ్లు వదిలి వెళ్లారు గుర్తుతెలియని వ్యక్తులు.. పెద్దారెడ్డి ఇంటి సమీపంలో రాళ్లు ఉండడంతో అప్రమత్తమైన పోలీసులు.. భద్రత ఏర్పాటు చేశారు.. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో.. తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నాలు సాగిస్తుండగా.. ఇప్పుడు తాడిపత్రిలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది..
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!