Parakamani Theft Case: పరకామణి చోరీ కేసుకు సంబంధించిన విచారణలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో తప్పు ఏముంది? అని ప్రశ్నించిన ధర్మాసనం, అది కేవలం ప్రాథమిక అభిప్రాయం మాత్రమేనని స్పష్టం చేసింది. లోక్ అదాలత్ ఇచ్చిన ఉత్తర్వుల చట్టబద్ధతను తేల్చే అధికారం ఈ ధర్మాసనానికే ఉందని పేర్కొన్న హైకోర్టు, దేవాలయాల ప్రయోజనాలను కాపాడే విషయంలో న్యాయస్థానాలే మొదటి సంరక్షులు అని వ్యాఖ్యానించింది. ఇక, రవి కుమార్ దాఖలు…
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన ఏపీ లిక్కర్ కేసులో పిటిషన్లపై ఈరోజు జరిగిన విచారణలో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఏ–2 వాసుదేవ రెడ్డి, ఏ–3 సత్యప్రసాద్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ కొనసాగుతున్న సందర్భంగా, సహనిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ పై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. సహనిందితుడు ఇంప్లీడ్ పిటిషన్ వేయడం కొత్త విషయం కాదన్న కోర్టు..…
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితులుగా ఉన్న ఏ2 వాసుదేవ రెడ్డి, ఏ3 సత్యప్రసాద్‌లు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో ఏసీబీ కోర్టులో ఈ ఇద్దరు ముందస్తు బెయిల్ పిటిషన్లు వేయగా.. కోర్టు డిస్మిస్ చేయటంతో హైకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో ఈ ఇద్దరికి ముందస్తు బెయిల్ ఇవ్వద్దని కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.…
High Court Judgement: ప్రభుత్వ ఉద్యోగాలలో ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు (శుక్రవారం) కీలక విచారణ జరిగింది. ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాలలో ఆరు నెలల్లోగా రిజర్వేషన్లు కల్పించి తీరాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంకు చెందిన ట్రాన్స్ జెండర్ రేఖ హైకోర్టును ఆశ్రయించారు. 2025 మెగా డీఎస్సీలో రేఖ 671 ర్యాంకు సాధించారు. అయితే ట్రాన్స్ జెండర్ల కోసం ఎటువంటి పోస్టులను…
AP High Court: విజయవాడలో సంచలనం సృష్టించిన చిన్నారి వైష్ణవి కిడ్నాప్, హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ట్రైల్ కోర్టులో తమకు విధించిన శిక్షను రద్దు చేయాలని నిందితులు హైకోర్టులో వేసిన పిటిషన్లపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో నిందితులు మోర్ల శ్రీనివాసరావు, యంపరాల జగదీష్ అప్పీళ్లను కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వీరికి జీవిత ఖైదు విధింపును హైకోర్టు సమర్థించింది. మరో నిందితుడు పంది వెంకట్రావును నిర్దోషిగా ధర్మాసనం ప్రకటించింది. ట్రైల్…
AP High Court: వైద్య కళాశాలలను పీపీపీ మోడల్ కి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలైంది. వైద్య కళాశాలను పీపీపీకి ఇవ్వటం ద్వారా థర్డ్ పార్టీకి హక్కులు కల్పించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
AP High Court: కొన్ని కేసుల్లో సత్వర న్యాయం దొరికినా.. మరికొన్ని కేసుల్లో మాత్రం.. ఏళ్లు గడిచినా ఫలితం లేకుండా పోతుంది.. అయితే, పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులపై ఓ వివాహిత అదృశ్యంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఓ వివాహిత 13 ఏళ్ల క్రితం అదృశ్యమైతే ఆమె ఆచూకీని పోలీసులు ఇప్పటికీ తెలుసుకోకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది హైకోర్టు.. ఆమె బతికుందో లేదో కూడా తెలియకుంటే..? ఆ తల్లిదండ్రుల వేదన ఎలా ఉంటుందో మీకు…
TTD Parakamani Case : టీటీడీ పరకామణి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. సీజ్ చేసిన వివరాలు సీల్డ్ కవర్ లో హైకోర్టు రిజిస్టర్ కి అందజేశారు సీఐడీ అధికారులు. ఇక, ఈ కేసులో తదుపరి విచారణ ఈనెల 27కి హైకోర్టు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయనందుకు టీటీడీపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటర్ వేయకుండా జాప్యం చేసినందుకు ఏపీ న్యాయవాదుల అసోసియేషన్ కి 20 వేల రూపాయలు డిపాజిట్ చేయాలని ఆదేశించారు…
AP High Court: తెలుగుదేశం పార్టీకి చెందిన కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవరెడ్డికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అప్పటి మేయర్ సురేష్‌బాబు నేతృత్వంలో మునిసిపల్ కార్పొరేషన్ చేసిన తీర్మానాలను రద్దు చేసే అధికార పరిధి మునిసిపల్ కమిషనర్‌కు లేదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మాధవిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. మునిసిపల్ కార్పొరేషన్ చేసిన తీర్మానాలను రద్దు చేసే అధికార పరిధి మునిసిపల్ కమిషనర్ లేనే లేదని ధర్మాసనం…
AP High Court: సమగ్ర శిక్ష పథకం కింద నిర్వహించే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలలో (కేజీబీవీ) శాశ్వత ప్రాతిపదికన బోధన సిబ్బందిని నియమించే వ్యవహారంపై మార్గదర్శకాలు రూపొందించి విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. దేశ వ్యాప్తంగా పేద పిల్లల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని.. శాశ్వత సిబ్బందిని నియమించే విషయంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చర్చలు జరపాలని పేర్కొంది.. తదుపరి విచారణలో చర్చల పురోగతిని కోర్టుకు చెప్పాలని ఆదేశించింది హైకోర్టు..…