వల్లభనేని వంశీ భార్య పంకజ శ్రీ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. వల్లభనేని వంశీ అరెస్ట్ అక్రమమని పేర్కొన్న ఆమె.. వంశీని అరెస్ట్ చేసిన సమయంలో పటమట పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ను భద్రపరిచాలని పంకజ శ్రీ తన పిటిషన్లో పేర్కొన్నారు..
ఏపీ హైకోర్టులో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఇచ్చిన సీఐడీ నోటీసులపై స్టే ఇవ్వాలని పిటిషన్ లో కోరాడు రామ్ గోపాల్ వర్మ. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సీఐడీకి ఫిర్యాదులు అందాయి. దానికి తోడు విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాను చిత్రీకరించారని వర్మపై గతంలోనే ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలని వర్మకి సీఐడీ నోటీసులు జారీ చేసింది. OG :…
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో హింస జరిగిందంటూ ఏపీ హైకోర్టులో పిల్ వేసిన బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి.. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. చాలామందిని భయపెట్టడం దాడులు చేశారు.. ఎన్నికలు జరుగుతున్న సమయంలో హింసను నివారించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాలని నేను పిల్ వేశాను.
సోషల్ మీడియా పోస్టులపై కీలక వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. అసలు, సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల నిరోధానికి ఏ చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందో ఆ వివరాలు తమ ముందు ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో సజ్జల భార్గవ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. సోషల్ మీడియాలో పెడుతున్న అసభ్య, అభ్యంతరకరమైన పోస్టులు కట్టడి చేయాల్సిందేనని స్పష్టం చేసింది.
గ్రూప్ 2 పరీక్షలు నిలుపుదల చేస్తూ స్టే ఇవ్వటానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది.. హరిజెంటల్ రిజర్వేషన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తదుపరి చర్యలు నిలుపుదల చేయాలని దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు.. గ్రూప్ 2 ప్రధాన పరీక్ష నిలుపుదల సాధ్యం కాదని స్పష్టం చేసింది..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా ఉన్న వంశీ.. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. బెయిల్ మంజూరు చేసేది లేదంటూ స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఇటీవల దళిత యువకుడు సత్యవర్ధన్…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ కేసులో ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. వల్లభనేని వంశీకి సంబంధించిన పలు పిటిషన్ల మీద బెజవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు విచారణ జరిపింది. వంశీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయటంతో విచారణ జరిపారు.
కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. హైకోర్టు బెంచ్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వ ప్రతిపాదన సవాలు చేస్తూ దాఖలైన పిల్ పై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.. 28-10-2024 లా సెక్రటరీ హైకోర్టుకి పంపిన లేఖ నిబంధనలకు విరుద్ధమన్నారు పిటిషనర్ న్యాయవాది యోగేష్.. అయతే, బెంచ్ ఏర్పాటుపై తమదే తుది నిర్ణయమని న్యాయస్థానం పేర్కొంది..
ఏపీ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్ దాఖలు చేశారు.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కాసరనేని వెంకట పాండురంగారావు పై గత ఏడాది జరిగిన దాడికి సంబంధించి నమోదైన కేసులో పోలీసులు తనను ఇరికించే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు వంశీ..
ఆంధ్రప్రదేశ్లోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు.. అన్ని పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలు పనితీరుపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది..