Posani Krishna Murali: సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.. సూళ్లూరుపేట పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలపై క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు పోసాని కృష్ణమురళి.. అయితే, పోసాని పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. కేసుపై తదుపరి చర్యలు నిలిపివేస్తూ స్టే ఇచ్చింది.. ఇదే సమయంలో.. కేసులో విచారణ అధికారిగా ఉన్న మురళీ కృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేసింది.. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరించారని సీరియస్ అయ్యింది.. కేసులో అదనంగా 111 సెక్షన్‌తో పాటు మహిళను అసభ్యంగా చిత్రీకరించారని సెక్షన్లు నమోదు చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయని హైకోర్టు ప్రశ్నించింది.. ఐవో మురళీ కృష్ణకు ఫామ్ 1 నోటీసు జారీ చేసింది హైకోర్టు.. రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ… తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు..
Read Also: TDP: వైఎస్ భారతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఐటీడీపీ కార్యకర్తపై అధిష్టానం చర్యలు..