Kakani Govardhan Reddy Case: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది.. కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.. తనపై నమోదైన కేసుల విచారణపై స్టే విధించాలని దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ డిస్మిస్ చేసింది ఏపీ హైకోర్టు.. ఎటువంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన స్పష్టం చేసింది న్యాయస్థానం.. ఇక, కాకాణి క్వాష్ పిటిషన్ పై తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.. తెల్ల రాయి అక్రమ రవాణా సహకరిస్తున్నారని కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే.
Read Also: Tenali Double Horse : “మిల్లెట్ మార్వెల్స్” ఆవిష్కరణకు సిద్ధమైన తెనాలి డబుల్ హార్స్
కాగా, కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆచూకీ కోసం పోలీసుల తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు.. మూడు బృందాలతో గాలింపు చేపట్టారు పోలీసులు.. కాకాణి సమీప బంధువుల నుంచి సమాచారం సేకరించే పనిలోపడిపోయారు.. హైదరాబాద్, నెల్లూరు సహా.. మరికొన్ని ప్రాంతాల్లో కాకాణి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారట నెల్లూరు పోలీసులు.. మరోవైపు.. మాజీ మంత్రి కాకాణి కేసులో మరో ముగ్గురికి నోటీసులు ఇచ్చారు పోలీసులు.. కాకాణి గోవర్ధన్ రెడ్డి చిన్న అల్లుడు గోపాలకృష్ణారెడ్డి.. కాంట్రాక్టర్ ఊరుబిండి ప్రభాకర్ రెడ్డి. ఊరు బిండి చైతన్యలకు నోటీసులు జారీ చేశారు పోలీసులు.. అయితే, విచారణ హాజరైనందుకు ప్రభాకర్ రెడ్డి.. చైతన్య.. గోపాలకృష్ణారెడ్డి సమయం కోరారు.. పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన తెల్ల రాయి అక్రమ తవ్వకం.. రవాణాకు సంబంధించి మరిన్ని వివరాల కోసం వీరిని విచారించాలనే నిర్ణయానికి వచ్చారట పోలీసులు.. ఇక కాకాణి గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇవ్వాలని చూస్తున్న పోలీసులకు ఆయన దొరకడం లేదు.. నెల్లూరులో, హైదరాబాద్‌లో ప్రయత్నించి విఫలమైన పోలీసులు.. నెల్లూరు ఇంటి గోడకు నోటీసు అంటించడం.. హైదరాబాద్ లో ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేసిన విషయం విదితమే.. అయితే, ముందస్తు బెయిల్ కోసం.. మరోవైపు.. కేసు క్వాష్ చేయించుకోవడానికి కాకాణి చేసే ప్రయత్నాలు ముందుకు సాగడంలేదు..