SIT notices to MP Mithun Reddy: లిక్కర్ స్కాంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది సిట్.. ఈ నెల 19వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది సిట్.. ఇక, ఇదే కేసులో రేపు విచారణకు హాజరు కావాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చిన విషయం విదితమే.. కానీ, ఒకరోజు ముందుగానే సిట్ విచారణకు వస్తానని విజయసాయిరెడ్డి సమాచారం ఇవ్వడం.. సిట్ అంగీకరించడం జరిగిపోయాయి..
Read Also: Andhra to Andhra via Telangana: ఆంధ్రా to ఆంధ్రా వయా తెలంగాణ.. గళమెత్తిన కూటమిలోని మరో ఎమ్మెల్యే..!
మరోవైపు, ఏపీ హైకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట దక్కింది.. ఎంపీ మిథున్‌రెడ్డి పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. లిక్కర్ స్కాంలో సిట్ విచారణకు న్యాయవాదిని అనుమతించింది.. అయితే, విచారణ సమయంలో స్టేట్‌మెంట్ రికార్డు చేయటంలో జోక్యం చేసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు.. స్టేట్‌మెంట్ ఆడియో, వీడియో రికార్డు చేయాలని ఎంపీ మిథున్ రెడ్డి లాయర్ కోరగా.. విజిబుల్ సీసీ కెమెరాలు ఉన్న చోట విచారణ జరపాలని ఆదేశించింది న్యాయస్థానం..
Read Also: UP: మీరట్‌లో మరో దారుణం.. ప్రియుడి కోసం భర్తపై ‘స్నేక్’ అస్త్రం
కాగా, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందని కూటమి నేతల ఫిర్యాదుతో విచారణ మొదలు కావటం.. ఓ సిట్ ను విచారణకు నియమించటం.. గత పదినెలలుగా విచారణ సాగుతూనే ఉన్న విషయం విదితమే.. అయితే, కూటమి ప్రభుత్వానికి ఊహించని విధంగా మాజీ వైసీపీ కీలక నేత సాయిరెడ్డి మద్యం కేసులో కర్త, కర్మ, క్రియ మొత్తం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటూ చేసిన లీక్స్ ఏపీ పాలిటిక్స్ లో ప్రకంపనలు సృష్టించాయి.. అంతేకాదు, మద్యం కేసులో విచారణకు వస్తే తనకు తెలిసిన సమాచారం మొత్తం సిట్ అధికారులకు ఇస్తానని గతంలోనే ప్రకటించారు సాయిరెడ్డి..