వర్షాల కొరత నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితులు, కంటిన్జెన్సీ ప్రణాళికపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులను సీఎంకు వాతావరణ శాఖ అధికారులు వివరించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి ప్యాంట్ షర్ట్ వేస్తే చంద్రబాబు లాగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. చేసిన తప్పులకు శేష జీవితంలో చంద్రబాబు ఫలితం అనుభవించక తప్పదు అని ఆయన విమర్శించారు.
నా భూమి.. నా దేశం కార్యక్రమం చేపట్టాలన్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ కౌంటర్ ఇచ్చారు. నా భూమి.. నా దేశం పేరుతో బీజేపీ మరో కొత్త రాజకీయానికి తెరలేపింది అంటూ ఆమె ఆరోపించారు.
ఈనెల 17న ధర్నా చేసుకునేందుకు సీపీఎస్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. పలు షరతులతో కూడిన అనుమతిని ఉన్నత న్యాయస్థానం ఇచ్చింది. ఈ ధర్నాలో నల్లబ్యాడ్జీలు ధరించి సీపీఎస్ ఉద్యోగులు నిరసన తెలియజేయనున్నారు.
మేం గేట్లు తెరిస్తే వైసీపీ ఉండదు అని చంద్రబాబు అన్నారు.. చంద్రబాబు ముసలి నక్క, జిత్తులమారివి అని రాష్ట్ర ప్రజలకు తెలుసు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటు పొడిచి చావుకు కారణం.. చంద్రబాబుకు బుర్ర పాడైపోయిందా?.. అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబుపై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. కుప్పంలో దొంగ ఓట్లతోనే ఆయన గెలుస్తున్నాడని మంత్రి సీదిరి అన్నారు. కుప్పంలోనే 30 నుంచి 40వేల బోగస్ ఓట్లు ఉన్నాయని ఆయన ఆరోపించారు. కుప్పంలో దొంగ ఓట్లు పోతాయనే భయంతో బాబు మొసలి కన్నీరు కారుస్తున్నాడంటూ మంత్రి మండిపడ్డారు.
దివంగత నేత నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా నిన్న (సోమవారం) భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 100 రూపాయల స్మారక నాణెం విడుదల చేశారు. అయితే ఈ నాణేన్ని దక్కించుకోవడం కోసం ఎన్టీఆర్ అభిమానులు భారీగా పోటీపడుతున్నారు.
ఏపీ విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నాకు అనుమతి కోరుతూ.. ఏపీ విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు పిటిషన్ దాఖలు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పండుగ జరుపుకోవడంపై సందిగ్ధత కొనసాగుతుంది. స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇచ్చే అంశంపై ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా డైలామాలో పడ్డాయి.