జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఆరో రోజు వారాహి విజయ యాత్రలో ఆయన పాల్గోనున్నారు. ఫీల్డ్ విజిట్ కోసం భీమిలి(మండలం)ఎర్రమట్టి దిబ్బలను జనసేనాని పరిశీలించనున్నారు.
టీడీపీ నేత గద్దె రామ్మోహన్ వ్యాఖ్యలకు వైసీపీ విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దేవినేని అవినాష్ కౌంటర్ ఇచ్చారు. జిల్లా పరువు దిగజారిపోయిందన్న గద్దె విమర్శలును ఆయన ఖండించారు. టీడీపీ హయాంలో కాల్ మని, సెక్స్ రాకెట్ తో జిల్లా పరువు పోయింది.. కృష్ణా జిల్లా పరువును నిలబెట్టిన నాయకుడు సీఎం జగన్ అని ఆయన అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని తొందరలోనే ప్రారంభిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రతి రోజు 500 మంది ఇక్కడ అంబేద్కర్ స్మృతివనం పనులు చేస్తున్నారు.. అంబేద్కర్ విగ్రహం ఇంతపెద్దది ఇదే.. 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ మెగా ప్రాజెక్టు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 954 మంది పోలీసులకు పోలీస్ సేవా పతకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 229 మందికి పోలీసు గ్యాలంటరీ పతకాలు, 82 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 642 మందికి పోలీసు సేవా పతకాలు అందించనుంది. ఇక, తెలంగాణ రాష్ట్రం నుంచి 34 మంది ఎంపిక అయ్యారు.
తిరుమలలో అలిపిరి నడక మార్గంలో చిరుత దాడిలో మృతి చెందిన బాలిక ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. ఈ క్రమంలో తిరుమల నడక మార్గంలో హై అలర్ట్ జోన్‌ను ప్రకటించింది. భక్తులకు భద్రతా సిబ్బంది పర్యవేక్షణను టీటీడీ తప్పనిసరి చేసింది.
తాడేపల్లిలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు, పరిశీలకులు, జేసీఎస్ కోర్డినేటర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో దొంగ ఓట్ల గుర్తింపు, ఓటర్ల నమోదుపై వైసీపీ పార్టీ ఫోకస్ పెట్టిందని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను దెబ్బతీసే విధంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే ఎవరినీ ఉపేక్షించేలేదని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు. ఇవాళ (శనివారం) పశ్యిమగోదావరి జిల్లా నరసాపురంలో డీజీపీ పర్యటించారు
ప్రభుత్వం వారం వారం సమీక్షల మీద ఉన్న శ్రద్ధ.. ఉద్యోగులకు నిధులు, కనీస సౌకర్యాలు కల్పించడంపై ఉంటే బాగుండేది అని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ ఉద్యోగుల సంఘం అన్నారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ( శుక్రవారం ) ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి- అమలాపురం మండలం జనుపల్లి బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించనున్నారు. అనంతరం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం లబ్దిదారులకు నిధులను విడుదల చేయనున్నారు.
రాజకీయం అంటూ ఏంటీ అని చంద్రబాబు, లోకేష్ లపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలకు, ప్రాంతాలకు, కులాలకు అతీతంగా రాష్ట్రంలోని అందరికి అన్నీ అందిస్తున్నామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.