దివంగత నేత నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా నిన్న (సోమవారం) భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 100 రూపాయల స్మారక నాణెం విడుదల చేశారు. అయితే ఈ నాణేన్ని దక్కించుకోవడం కోసం ఎన్టీఆర్ అభిమానులు భారీగా పోటీపడుతున్నారు. తెలంగాణతో పాటు ఏపీ నుంచి అభిమానులు హైదరాబాద్, సైఫాబాద్ మింట్ మ్యూజియంలో నాణేల కోసం క్యూ లైన్‌లలో నిలబడి ఎన్టీఆర్ వంద నాణెం కొనుగోలు చేస్తున్నారు. గంటల తరబడి లైన్‌లో నిలబడి సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాణెం కొనుగోలు చేస్తున్నారు.
Read Also: BJP: టార్గెట్ 2024.. అప్పుడే బీజేపీ లోక్సభ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్..!
ఎన్టీఆర్ రూ. 100 స్మారక నాణేన్ని మూడు ధరల్లో మింట్ అధికారులు నిర్ణయించి అమ్ముతున్నారు. రూ. 4,850, రూ. 4,380, రూ.4,050గా ధరలను నిర్ణయించి అధికారులు గిఫ్ట్ బాక్స్‌తో ఆ నాణాన్ని అమ్ముతున్నారు. ప్రస్తుతం ఈ అమ్మకాలు జరిగే ప్రదేశంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేలల్లో క్యూ కట్టారు. కాగా గతంలో అనేక రకాల నాణేలు తయారు చేసినప్పటికీ ఓ వ్యక్తిగా గుర్తుగా నాణంని రాష్ట్రపతి రిలీక్ చేయడం.. ఎన్టీఆర్ దే కావడం ఇక్కడ గమనార్హం. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలామంది ఈ నాణాన్ని కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .
Read Also: Malavika Mohanan: ఓనం అందాలతో మాయచేస్తున్న మాళవిక మోహనన్
కాగా, చాలామంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నాణాని కొనుక్కోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతానికి 12,000 నాణేలని ముద్రించామని డిమాండ్ మరింత ఉంటే మరిన్ని తయారు చేయనున్నట్లు గవర్నమెంట్ తెలిపింది. తాజాగా రిలీజ్ అయిన ఎన్టీఆర్ చిత్రంతో వందరూపాయలు కాయిన్ ని చాలా మంది తెలుగువారు కొనుక్కోవడానికి ముందుకు వస్తున్నారు. 100 రూపాయల స్మారక నాణంని మూడు ధరల్లో నిర్ణయించి అధికారులు అమ్ముతున్నారు.