టీటీడీ చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పదవి బాధ్యతలను స్వీకరించారు. ఇవాళ ఉదయం 11.44 గంటలకు గరుడాళ్వార్ సన్నిధిలో టీడీడీ ఛైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ తలపెట్టిన మహాధర్మలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. ఒంగోలు కలెక్టరేట్ దగ్గర ఆందోళన నిర్వహించారు. సర్పంచ్ లకు అన్యాయం చేస్తున్నారని బీజేపీ గళం విప్పిన తరువాత వెయ్యి కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు చెప్పారని దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు
మనం ఒక్క సిమ్ కార్డు తీసుకునేందుకు నానా తిప్పలు పడుతుంటే ఓ వ్యక్తి ఏకంగా వందల సంఖ్యలో సిమ్ కార్డ్స్ తీసుకుని వాడుతున్నాడు. ఎక్కడో కాదండోయ్ మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగింది.
ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు వైఎస్ఆర్ కల్యాణ మస్తు, షాదీతోపా మూడో విడత ఆర్థిక సాయాన్ని నేడు విడుదల చేయనుంది. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్ లో ముఖ్యమంత్రి జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా నిధులను లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లో జమ చేయనున్నారు.
టీడీపీ పెత్తందార్ల వైపు.. మేము పేదల వైపు ఉన్నామని ఎంపీ నందిగాం సురేష్ అన్నారు. సీఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్ళు ఇస్తామంటే మోకాలడ్డి చంద్రబాబు శునకానందం పొందుతున్నాడు. అమరావతి మీ అడ్డా కాదు.. మా బిడ్డలు ఉంటారు.. ఈ యుద్ధంలో మేం కచ్చితంగా గెలిచి తీరుతామని ఆయన పేర్కొన్నారు.
పోలీసులపై టీడీపీ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ హోంమంత్రి తానేటి వనిత అన్నారు. పోలీసులపై దాడి చేయడం అమానుష చర్య అని ఆమె తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారు అని హోంమంత్రి పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ శ్రేణులు దాడులను ఎంపీ మార్గాని భరత్ ఖండించారు. పోలీసులపై దాడి చేయించడం అమానుషం.. చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెబుతారు.. టీడీపీ శ్రేణుల దాడులు ప్రీ ప్లాన్డ్ స్కెచ్ గా కనిపిస్తుంది అని ఎంపీ భరత్ ఆరోపించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసేంది వారాహి యాత్ర కాదు నారహి యాత్ర అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. పవన్ విశాఖలో నారాహి యాత్రను ఉపసంహరించుకోవాలి.. పవన్ కళ్యాణ్ ను చూసి మోడీ మొహం చాటేశారు.. పవన్ మీద ఏమైనా ఇల్లీగల్ కేసులు ఉన్నాయా..? అని కేఏ పాల్ అడిగారు.
రౌడీయిజం చేయగలిగినవాడే రాజకీయ నాయకుడు అనుకోవాలా? అని ఆయన అన్నారు. కరడుగట్టిన చట్టాలున్న దేశంల్లో బతకొచ్చు.. ఇక్కడ మాత్రం బతకలేని పరిస్థితులు కల్పించారు. రాష్ట్రంలో కౌన్సిలర్ కూడా బెదిరించేస్తాడు.. అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు అని పవన్ కల్యాణ్ అన్నారు.
టీడీపీ ఎందుకిలా అసత్యాలు ప్రచారం చేస్తుందని వైసీపీ మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత అన్నారు. రాష్ట్రం దిశ యాప్ తో మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం.. పదవుల్లో సైతం మహిళకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం.. పవన్, చంద్రబాబు, లోకేష్ వాలంటీర్లపై అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు.. వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేయటంతో ఇప్పుడు తోక ముడిచారు