తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పండుగ జరుపుకోవడంపై సందిగ్ధత కొనసాగుతుంది. స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇచ్చే అంశంపై ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా డైలామాలో పడ్డాయి. సెప్టెంబర్ 19నే వినాయక చవితి నిర్వహిస్తామని హైదరాబాద్ భాగ్యనగర్ ఉత్సవ సమితీ ఇప్పటికే ప్రకటనను జారీ చేసింది. పండుగకు మరి కొన్ని రోజుల సమయం ఉన్నందున పలువురు పండితుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత సెలవులు ఇచ్చే విషయంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఓ నిర్ణయం తీసుకోనున్నాయి.
Read Also: Geetika Srivastava: పాక్‌లో భారత తొలి మహిళా డిప్యూటీ హైకమిషనర్‌గా గీతికా శ్రీవాత్సవ..
అయితే, సెప్టెంబర్ 19వ తేదీనే సాంప్రదాయబద్ధంగా వినాయక చవితి పండుగ, 28వ తేదీన నిమజ్జనం ఉంటుందని భాగ్యనగర్ వినాయక ఉత్సవ సమితి సభ్యులు స్పష్టం చేశారు. సెప్టెంబర్ 18న మధ్యాహ్నం చవితి మొదలై 19వ తేదీ మధ్యాహ్నం వరకు ఉంటుందని వారు పేర్కొన్నారు. ఇక, సూర్యోదయం తర్వాత వచ్చిన తిథినే పండగ రోజుగా గుర్తిస్తామని ఉత్సవ కమిటీ తెలిపింది. కాబట్టి 19వ తేదీన వినాయక చవితి జరుపుతున్నామని వారు చెప్పారు.
Read Also: Food Poison: మహారాష్ట్రలో 160 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్.. ఆస్పత్రిలో చికిత్స
ఇక, గత ఏడాది లాగే ఈసారి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం, అధికారులు చెప్పారని భాగ్య నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. గణేష్ పూజా విధానం తెలిపే బుక్ తో పాటు పూజా సామాగ్రిని భక్తులకు ఇవ్వాలని ఉత్సవ కమిటీ పేర్కొన్నారు. వినాయక మండపాలకు పోలీస్ పర్మిషన్ తప్పనిసరి కాదని, స్థానిక పోలీస్ స్టేషన్లో చెప్పితే సరిపోతుందని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పారు.. అయితే, గణేష్ పండగకు స్కూళ్లు, కాలేజీలకు ఏ రోజు సెలవులు ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.