రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని వైసీపీ నేతలు కలిశారు. ఏపీలో ఎన్నికల ఓటర్ లిస్టులో డూప్లికేట్ ఓటర్లు ఇంకా ఉన్నారు అని ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఒకే పేరు.. ఒకే ఐడీ.. ఒకే ఫొటోతో వేర్వేరు చోట్ల ఓట్లు ఉన్నాయి.. దీన్ని సరి చేయాలని ఎన్నికల అధికారిని కోరామని ఆయన పేర్కొన్నారు.
ప్రతీసారీ తప్పించుకుని పోతున్నాడు.. ఏదో రకంగా కోర్టులను మేనేజ్ చేసుకుంటూ మనుగడ సాగించాడు.. ఇవాళ దొంగ దొరికాడు.. ముందు నుంచి మేము ఏదైతే చంద్రబాబు గురించి చెబుతున్నామో అదే నిజమని తేలింది.. చంద్రబాబు జైలుకు వెళ్లటం ఖాయం అని ఆయన పేర్కొన్నారు.
మాజీ రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా రాజమండ్రిలోని వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
టీచర్స్ డే సందర్భంగా విశాఖపట్నంలో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకల్లో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు మా కుటుంబ సభ్యులు అని అన్నారు. ప్రభుత్వం వేరు ఉద్యోగులు వేరు కదనేది సీఎం జగన్ ఆలోచన.. ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకుండా ఏ ప్రభుత్వం అయినా ఉంటుందా?.. అని ఆయన ప్రశ్నించారు.
భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రి ఉదయ్ నిధి స్టాలిన్, సనాతాన ధర్మాన్ని దోమల నిర్మూలన చర్యతో పోల్చి నిర్మూలించాలనడం హైయమైన చర్య అని బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరి కేంద్రంలోని హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ లో ముగ్గురు దొంగలు చోరీకి ప్రయత్నించి విఫలం అయ్యారు. షట్టర్ తాళాలు పగలగొట్టి బ్యాంక్ లోకి ముగ్గురు దొంగలు ప్రవేశించారు. బ్యాంక్ లోకి ముగ్గురు దొంగలు వెళ్తుండగా పోలీస్ పెట్రోలింగ్ సైరన్ మోగడంతో అక్కడి నుంచి పారిపోయారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని వీరులపాడు మండలం పొన్నవరం సొంత గ్రామానికి విచ్చేసిన మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి "నా భూమి -నా దేశం" కార్యక్రమంలో పాల్గొన్నారు
సెప్టెంబరు 18వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇప్పటికే ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఈ వేడుకల్లో సామాన్య భక్తులకు పెద్దపీఠ వేస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు.