విశాఖలో మత్స్యకారుల సమస్య 30 ఏళ్ల క్రితంది అని మంత్రి సీదిరి అప్పల రాజు అన్నారు. దానికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు.. మత్స్యకారులతో చర్చించి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విశాఖ మత్స్యకారుల సమస్య పరిష్కారం కోసం కలెక్టర్‌తో మాట్లాడాను.. మత్స్యకారులకు ఇళ్ల స్థలాలు నెరవేర్చేందుకు ప్రయత్నిస్తామని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. చంద్రబాబు ఢిల్లీలో స్పాన్సర్ ప్రోగ్రాం పెట్టుకున్నారు.. అదే వేదికపై ఎన్టీఆర్ కి భారతరత్న ఎందుకు అడగలేదు.. ఎన్టీఆర్ గౌరవం తగ్గించారు.. బీజేపీ పెద్దల మెప్పు కోసం చంద్రబాబు లాబీయింగ్ చేశారు అని మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు.
Read Also: Mamata Banerjee: కేంద్రం గ్యాస్ ధరను తగ్గించడంపై విసుర్లు.. కారణాలివేనన్న దీదీ
చంద్రబాబుపై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. కుప్పంలో దొంగ ఓట్లతోనే ఆయన గెలుస్తున్నాడని మంత్రి సీదిరి అన్నారు. కుప్పంలోనే 30 నుంచి 40వేల బోగస్ ఓట్లు ఉన్నాయని ఆయన ఆరోపించారు. కుప్పంలో దొంగ ఓట్లు పోతాయనే భయంతో బాబు మొసలి కన్నీరు కారుస్తున్నాడంటూ మంత్రి మండిపడ్డారు. చాలాసార్లు బీజేపీ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో ఎన్టీఆర్ పేరు మీద స్పాన్సర్డ్ కార్యక్రమం పెట్టి బీజేపీ నేతలతో లాబీయింగ్ చేశాడు అని సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ బొమ్మతో ఓట్లు లబ్ధి పొందాలనేదే చంద్రబాబు తాపత్రయం.. ఎన్టీఆర్‌కు ప్రత్యేక గుర్తింపు కావాలనే ఆలోచన బాబుకు లేదు అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఎన్టీఆర్ బొమ్మతో చంద్రబాబుకు రాజకీయాలు మాత్రమే కావాలి అంటూ ఆయన విమర్శించారు.
Read Also: