జీపీఎస్ విషయంలో ఉద్యోగ సంఘాల మధ్య పంచాయతీ కొనసాగుతుంది. మిగిలిన ఉద్యోగ సంఘాలపై ఏపీసీపీఎస్ సంఘాల నేతలు విమర్శలు గుప్పించారు. తమ వల్లే చలో విజయవాడ కార్యక్రమంలో విజయవంతం అయ్యింది అని ఏపీసీపీఎస్ఎస్ఈఏ నేతలు అంటున్నారు. మిగిలిన ఉద్యోగ సంఘాలు తమను వాడుకుని వదిలేశాయని ఆరోపణలు చేశారు. ఓపీఎస్ మినహా మరో ప్రత్యామ్నాయం అంగీకరించమని వారు పేర్కొన్నారు. ఓపీఎస్ ఇచ్చే వరకు మా ఉద్యమం కొనసాగుతుంది అంటూ వెల్లడించారు.
Read Also: Nitish Kumar: ముందస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు.. ఎప్పుడైనా ఎన్నికలు జరగొచ్చన్న నితీష్
ఇక ఏపీ సచివాలయంలో జీపీఎస్ పై ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసింది. ఈ మీటింగ్ దాదాపు నాలుగు గంటల పాటు కొనసాగింది. ఈ సందర్భంగా ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ బొప్పరాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 92 రోజుల పాటు ఉద్యమం చేసిన చరిత్ర మాది అని పేర్కొన్నారు. సహ ఉద్యోగ సంఘాల నేతలపై విమర్శలు చేయటం కరెక్ట్ కాదు అంటూ ఆయన పేర్కొన్నారు.
Read Also: Punch Prasad: సర్జరీ తరువాత మొదటిసారి.. అతడి గురించి చెప్తూ ఎమోషనల్ అయిన జబర్దస్త్ కమెడియన్
జీపీఎస్ లో 50 శాతం పెన్షన్ గ్యారెంటీ, డీఆర్ ఇస్తామనటం సంతోషంగా ఉందని బొప్పరాజు అన్నారు. మొదటి సారి డీఆర్ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది.. రిటైర్మెంట్ తర్వాత 60 శాతం వెనక్కి తీసుకోవచ్చు అని ఆయన వెల్లడించారు. ఆ మేరకు పెన్షన్ మొత్తం తగ్గుతుంది.. సీపీఎస్, జీపీఎస్ లో ఉద్యోగులకు ఆప్షన్ ఉంటుంది.. 10 శాతం ఉద్యోగి కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది అని బొప్పరాజు అన్నారు. ఉద్యోగుల మధ్య వివాదాలు ఉండటం ప్రభుత్వానికి మంచిది కాదని ఆయన చెప్పుకొచ్చారు.