సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని శాంతి భద్రతలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గత పది రోజులుగా జరిగిన పరిణామాలను సీఎం జగన్ కు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి సహా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు వివరించారు.
బావిలో ఓ కుటుంబం మొత్తం శవమై తేలింది. పెళ్ళీడుకు వచ్చిన కూతురితో సహా దంపతులు మృతి చెంది కనిపించారు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నంలోని మర్రిపాలెంలో ఎండీ మహముద్దీన్ కుటుంబంతో కలిసి జీవించేవారు. ఏం జరిగిందో తెలీదుగానీ కుటుంబంతో సహా వ్యవసాయ బావిలో పడి మృతిచెందారు.
తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అరెస్టు సందర్భంగా సీఐడీ అధికారులు వ్యవహరించిన తీరును భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు అన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరు పర్చారు. ఈ కేసులో ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.
ఈ రిమాండ్ రిపోర్టులో నారా లోకేష్ పేరును కూడా చేర్చారు. చంద్రబాబు సన్నిహితుడు కిలారు రాజేష్ ద్వారా నారా లోకేష్ కు డబ్బులు అందినట్టు రిమాండ్ రిపోర్ట్ లో సీఐడీ అధికారులు పేర్కొన్నారు.
అన్నీ ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్ చేశారని ఆయన వ్యాఖ్యనించారు. కోర్టు ఏ నిర్ణయంతో.. వాస్తవాలు తెలుస్తాయి.. చంద్రబాబును జైలుకు పంపించాలని టార్గెట్ చేసుంటే ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేస్తారు.. చంద్రబాబును అరెస్టు చేయటానికి ఐదేళ్లు ఎదురు చూస్తారా అని బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
రాజధాని పేరుతో అమరావతిలో షెడ్ల వంటి రెండు తాత్కాలిక బిల్డింగ్ లు కట్టి వందల కోట్ల రూపాయలను కొట్టేసిన టీడీపీ అధినేత చంద్రబాబు శాశ్వత భవనాలు కట్టి ఉంటే ఎన్ని లక్షల కోట్ల ముడుపులు తీసుకునే వారో అని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్వీట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు.
రాజ్యాంగంలో ఇండియాతో పాటు భారత్ అని ముందే ఉంది అని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు. ఇండియా అని బ్రిటీష్ వాళ్ళు ఇచ్చిన పేరు.. దేశం పేరు భారత్ గా మారుస్తున్నారని ప్రచారం జరుగుతుంది.. భారత్ గా మార్చటం తప్పేం కాదు.. ఇందుకు రాజ్యాంగ సవరణ కూడా చేయాల్సి ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు.
మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. బాబు-కొడుకుల అరెస్ట్ ఎలా జరుగుతుందనే చర్చ ప్రస్తుతం జరుగుతోందన్నారు. తండ్రి బ్రోకర్.. కొడుకు జోకర్.. చంద్రబాబు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని ఐటీ శాఖ తేల్చేసింది అని మంత్రి కొట్టు పేర్కొన్నారు.
ప్రస్తుతం తెలుగు అంతరించిపోయే దశలో ఉందనే ఆందోళన కలుగుతోంది అని పురంధేశ్వరి అన్నారు. భాష మృతభాషగా మారడం మన సంస్కృతి అంతరించడమే.. మన సంస్కృతి, సాంప్రదాయం తెలుగు సాహిత్యంలో నిక్షిప్తమై ఉన్నాయని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యనించారు.