ఆంధ్రప్రదేశ్ ఆర్‌జేయూకేటీ ప్రవేశ పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ విడుదల చేశారు. ఆరేళ్ళ ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన విద్యార్థుల జాబితాను రిలీజ్ చేశారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు ఫైరయ్యారు. పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలనేదే పవన్ తాపత్రయమని ఆయన వ్యాఖ్యానించారు.
గుంటూరు జిల్లాలో తెనాలి వైకుంఠపురంలో మహిళా ఉద్యోగ చేతివాటం బయటపడింది. దేవాలయంలోని కానుకల హుండి లెక్కింపు సందర్భంగా స్వామివారికి వచ్చిన కానుకల్లోని ఉంగరాన్ని దొంగతనం చేసింది మహిళా ఉద్యోగి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మనబడి నాడు-నేడు అనే కార్యక్రమంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు.
Sharmila: వైయస్ షర్మిల గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న షర్మిల ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చాలా ఫేమస్ గా మారింది.
తోటి వ్యాపారులపైనే దాష్టీకానికి పాల్పడ్డారు. బకాయిలు అడిగినందుకు దుర్మార్గంగా వ్యవహరించారు. విచక్షణ మరిచి.. బట్టలు ఊడదీసి కొట్టారు. ఆపై వీడియోలు రికార్డు చేసి వికృత చేష్టలకు పాల్పడ్డారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. మహాద్వారం వద్ద స్వామివారి హుండీ పడిపోయింది. ఆలయం నుంచి శ్రీవారి హుండీని లారీలో పరకామణి మండపానికి తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో చేసిన ఆరోపణలపై వైసీపీ మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. తన తండ్రి ఇచ్చిన ఆస్తి కంటే రూపాయి ఎక్కువ ఉన్నా వెంకటేశ్వరస్వామి వద్ద ప్రమాణం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.