ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సింగిల్‌గా ఎదుర్కొంటామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. ముందు ఎన్నికలు వచ్చినా, వెనుక వచ్చినా మేము రెడీ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మొగల్తూరు మండలం మొళ్లపర్రు గ్రామంలో కరెంట్ షాక్‌తో ఇద్దరు మత్స్యకారులు మృత్యువాత పడిన ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. వైద్యశాఖలో కొత్తగా 2,118 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అల్లూరి జిల్లాలోని పాడేరు, వైయస్సార్ జిల్లాలోని పులివెందుల, కర్నూలు జిల్లాలోని ఆదోని మెడికల్ కాలేజీల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ సర్కారు నిర్ణయించింది.
గుంటూరులో భారీ చోరీ జరిగింది. కొత్తపేట మంగళబావి వీధిలో పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు.
ప్రజల ఆరోగ్యం కోసం ఏపీ సర్కారు పెద్ద పీట వేస్తోంది. ఇప్పటికే ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. సోమవారం 146 కొత్త అంబులెన్స్‌లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలో రానున్న మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు.