Wife Killed Husband: పెళ్లైన నెల రోజులకే.. ప్రియుడితో కలిసి భర్తను కాటికి పంపిన భార్య..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Killed Husband: ఈ మధ్యకాలంలో భర్తలపై భార్యలు చేస్తుస్తున్న ఘోరాలు రోజురోజుకు ఎక్కువతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలి జిల్లాలో ఓ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యను అజయ్ అనే యువకుడి భార్య, ఆమె ప్రియుడు, మరో యువకుడు కలిసి చేసినట్లు దర్యాప్తులో తేలింది. హత్య అనంతరం ఆధారాలను దాచిపెట్టేందుకు నిందితులు శవాన్ని బైక్ కింద పెట్టి ఘటనను రోడ్డు ప్రమాదంలా చూపించే ప్రయత్నం చేశారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసుల అందించిన సమాచారం ప్రకారం.. మార్చి 8న డయల్ 112 ద్వారా రజనియా కట్రా గ్రామం సమీపంలోని అడవిలో రోడ్డుకి పక్కన ఒక యువకుడి శవం బైక్ కింద ఉన్నట్లు సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దర్యాప్తులో మృతుడు ఖంతరా గ్రామానికి చెందిన అజయ్ వైశ్య (24)గా గుర్తించారు.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
దీనితో పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా.. అతని సోదరుడు వినయ్ వైశ్య అక్కడికి చేరుకున్నాడు. అజయ్ కు ఫిబ్రవరి 12న గన్నై గ్రామానికి చెందిన ఉమా వైశ్యతో వివాహం జరిగినట్లు తెలిపారు. మార్చి 7 సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో అజయ్ తన అత్తింటి గన్నై గ్రామానికి మోటార్‌సైకిల్‌పై వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరినట్లు తెలిపారు. అయితే అతను అక్కడికి చేరకపోవడంతో పాటు తిరిగి ఇంటికీ రాలేదు. అయితే మరుసటి రోజు అతని మరణ వార్త వారికి తెలిసింది.
సంఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలించగా ఆ ఘటన అనుమానాస్పదంగా కనిపించింది. మృతదేహంపై గాయాల గుర్తులు కనిపించాయి. అలాగే మోటార్ సైకిల్ ను ప్రమాదంలా కనిపించేలా ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. ఫోరెన్సిక్ బృందం సహాయంతో ఆధారాలను సేకరించారు. ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో కూడా హత్య అనుమానం వ్యక్తమవడంతో పోలీసులు గుర్తు తెలియని నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్పీ మనీష్ ఖత్రి నిందితుల పట్టివేతకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి రూ.10 వేల బహుమతిని ప్రకటించారు. దర్యాప్తులో భాగంగా మృతుడి భార్య ఉమా వైశ్యను పోలీసులు విచారించగా ఆమె నిజం ఒప్పుకుంది. పెళ్లికి ముందే తనకు అమర్ బహాదూర్ వైశ్యతో ప్రేమ సంబంధం ఉన్నట్లు, అతనితోనే పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు తెలిపింది. కానీ కుటుంబ ఒత్తిడితో తనను అజయ్‌తో వివాహం చేసుకున్నానని, అందువల్ల తాను సంతోషంగా లేనని వెల్లడించింది.
YS Jagan: నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం.. కీలక అంశాలపై మాట్లాడనున్న మాజీ సీఎం!
ఈ కారణంగానే ఉమా తన ప్రియుడు అమర్ బహాదూర్ వైశ్యతో కలిసి భర్తను హత్య చేయాలని కుట్ర పన్నింది. ప్లాన్ ప్రకారం మార్చి 7న ఉమా అజయ్ ను కలవాలని చెప్పి తన పుట్టింటికి రావాలని పిలిచింది. ఆ తర్వాత అతను వస్తున్నాడని తన ప్రియుడికి సమాచారం ఇచ్చింది. దీంతో అమర్ బహాదూర్ తన సహచరుడు చంద్రప్రతాప్ అలియాస్ చందన్ వైశ్యతో కలిసి బొలెరో వాహనంలో అక్కడికి వచ్చి అజయ్‌ను వెంబడించారు. రాత్రి సుమారు 9 నుంచి 10 గంటల మధ్య రజనియా కట్రా అడవిలోని ఓ ప్రాంతంలో నిందితులు అజయ్ మోటార్ సైకిల్ ను ఆపి.. అనంతరం మెడికల్ గ్లోవ్స్ ధరించి గమ్ఛాతో అతని గొంతు నులిమి, రాయితో తలపై పలుమార్లు దాడి చేయడంతో అక్కడికక్కడే అతను మృతి చెందాడు.
హత్య అనంతరం ఘటనను ప్రమాదంలా చూపించేందుకు మృతదేహం దగ్గర మోటార్ సైకిల్ ను ఉంచారు. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, ఘటనలో ఉపయోగించిన బొలెరో వాహనం సహా ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా జైలుకు తరలించారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!