*చంద్రయాన్- 3 ప్రయోగానికి మధ్యాహ్నం 2.35 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం.. 24 గంటల కౌంట్‌డౌన్ అనంతరం రేపు మధ్యాహ్నం ప్రయోగం.. శాస్త్రవేత్తలతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఇస్రో ఛైర్మన్
*విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో సమావేశం కానున్న సీఎం జగన్.. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ
*తిరుపతి: ఎస్వీ వర్శిటి స్టేడియంలో నేడు గడ్కరీ భారీ సభ.. సభలో జాతీయ రహదారులను జాతికి అంకితం ఇవ్వనున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.
*రెండు రోజుల పాటు ఫ్రాన్స్‌లో ప్రధాని మోడీ పర్యటన.. ఆ దేశానికి బయలుదేరిన ప్రధాని.. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవాలకు ముఖ్య అతిథిగా మోడీ.. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, సీఈవోలతో భేటీ కానున్న ప్రధాని.
*నేడు జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌కు వీడ్కోలు సభ.. సుప్రీం జడ్జిగా నియామకమైన జస్టిస్ ఉజ్జల్ భుయాన్.
*నేడు విజయవాడకు పురంధేశ్వరి.. ఉదయం 10.55 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు.. మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ నేతలతో సమావేశం.
*అనంతపురం: రెండో రోజు సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు.. హాజరుకానున్న బీవీ రాఘవులు
*ఏపీ: నేడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధ్యక్షతన ఉద్యోగ సంఘాలతో భేటీ