Dhurandhar 2 : ధురంధర్ మానియా ముందు పెద్ద సినిమాలేవీ నిలవలేకపోతున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఒకటే నామస్మరణ వినిపిస్తోంది.. అదే ‘ధురంధర్ 2′. మొదటి భాగం సృష్టించిన రికార్డుల ప్రభంజనం తర్వాత, సీక్వెల్‌గా వస్తున్న ‘ధురంధర్: ది రివెంజ్’ మానియా ముందు పెద్ద పెద్ద సినిమాలు కూడా నిలవలేక వెనక్కి తగ్గుతున్నాయి. మార్చి 19న ఈ చిత్రం విడుదల కానుండటంతో అదే రోజున రావాల్సిన క్రేజీ ప్రాజెక్టులు బాక్సాఫీస్ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక తమ విడుదల తేదీలను మార్చుకుంటున్నాయి.
Also Read : Nag 100 : “తమిళ దర్శకుడైతే ఏంటి?”.. దర్శకుడికి నాగార్జున క్లారిటీ
Also Read
- Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
- Hyderabad: "కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు".. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
- KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పాన్ ఇండియా స్టార్ యష్ నటిస్తున్న ‘టాక్సిక్‘ సినిమా కూడా మార్చి 19న విడుదల కావాల్సి ఉంది. కానీ, అనూహ్యంగా ఈ చిత్రాన్ని జూన్ 4కి వాయిదా వేశారు. మేకర్స్ మాత్రం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా షూటింగ్ ఆలస్యమైందని, అందుకే వాయిదా వేస్తున్నామని చెబుతున్నారు. కానీ, ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ‘ధురంధర్ 2’ క్రేజ్ ముందు నిలబడలేమన్న భయంతోనే టాక్సిక్ టీమ్ వెనక్కి తగ్గిందనే చర్చ నడుస్తోంది. ‘ధురంధర్’కు లేని యుద్ధం అడ్డంకి ‘టాక్సిక్’కు ఎలా వచ్చిందనే ప్రశ్నలు నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి. కేవలం యష్ మాత్రమే కాదు, విలక్షణ నటుడు అడివి శేష్ నటిస్తున్న ‘డెకాయిట్‘ కూడా ఈ పోరు నుంచి ముందే తప్పుకుంది. ధురంధర్ 2 మానియాని ముందే పసిగట్టిన డెకాయిట్ టీమ్, తమ సినిమాను ఏప్రిల్ 10కి వాయిదా వేసుకుంది. కంటెంట్ ఎంత బాగున్నా, ధురంధర్ వంటి భారీ సీక్వెల్ ముందు థియేటర్లు దొరకడం, ఓపెనింగ్స్ రాబట్టడం కష్టమని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి, ‘ధురంధర్ 2’ మానియా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఇతర సినిమాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మార్చి 19న ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!
తాజావార్తలు
-
Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
-
Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
-
Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?