పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుళ్ల గ్రామంలో ఆలయంలోనే దొంగతనం చేసేందుకు దుండగులు తెగబడ్డారు. ఆరుళ్ల గ్రామంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తన ఒంటిపై చేయి పడితే జనసేన ప్రభుత్వం వచ్చాక వైసీపీ గూండాలను ఇళ్లలోంచి లాక్కొచ్చి మరీ కొడతామని హెచ్చరించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో జరిగిన వారాహి విజయ యాత్రలో ఆయన ప్రసంగిస్తూ.. తనకు జెడ్ కేటగిరి సెక్యూరిటీ అక్కర్లేదన్నారు.
ఈ నెల 28న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జగనన్న అమ్మ ఒడి పథకం నాలుగో ఏడాది నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతం జరిగింది. సరోగసీ తల్లి ఆవు ద్వారా మరో ఆవు జన్మించింది. ఏపీలో ఇలా ఆవిష్కృతం కావడం ఇదే తొలిసారి అని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. కొత్తగా పుట్టిన ఆవుకు ‘పద్మావతి’గా నామకరణం చేశామన్నారు.
మాజీ మంత్రి దేవినేని ఉమాపై మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మండిపడ్డారు. 'అన్నీ ఉన్నమ్మ అణిగి మణిగి ఉంటే ఏమి లేనమ్మ ఎగిరెగిరి పడుతోంది' అన్నట్లుగా దేవినేని ఉమా పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.
నవమాసాలు మోసి కనిపెంచితే వృద్ధాప్యంలో తోడుగా ఉంటారనుకున్న బిడ్డలు క్షణికావేశంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలతో ఆ తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు.
రాష్ట్రంలో ఓటర్ల తొలగింపుపై 'ఓట్ ఇండియా - సేవ్ డెమోక్రసీ' పేరుతో లోక్సత్తా ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. విజయనగరంలోని మయూరా హోటల్ కాన్ఫిరెన్స్ హాల్లో పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ పోస్టర్ ఆవిష్కరించారు.
దేశంలోని చాలా ప్రాంతాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నంపూట బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రేపు, ఎల్లుండి ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మరింత తీవ్రంగా ఉండనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.